
D Educt: Sept 22: రాష్ట్రంలో ఎంఏ, ఎంకాం, ఎంఎస్సీ తదితర పీజీ కోర్సుల్లో సీట్ల భర్తీకి సంబంధించిన సీపీగెట్ రెండో విడత కౌన్సెలింగ్ సెప్టెంబరు 22 నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు కౌన్సెలింగ్ షెడ్యూల్ను కన్వీనర్ ఆచార్య ఐ. పాండురంగారెడ్డి వెల్లడించారు.
సెప్టెంబరు 22 నుంచి 26వ తేదీ వరకు విద్యార్థులు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అనంతరం సెప్టెంబరు 28 నుంచి 30వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకునే అవకాశం కల్పించనున్నారు.
కౌన్సెలింగ్ ప్రక్రియలో భాగంగా అక్టోబరు 5న విద్యార్థులకు సీట్ల కేటాయింపు చేపట్టనున్నట్లు కన్వీనర్ తెలిపారు. అర్హత కలిగిన అభ్యర్థులు నిర్ణీత గడువులోగా రిజిస్ట్రేషన్, వెబ్ ఆప్షన్ల ప్రక్రియను పూర్తి చేసుకోవాలని సూచించారు.
