D Spiritual: Nov 24: తమ బడ్జెట్‌‍కు అనుగుణంగా కారు కొనుగోలు చేసే వినియోగదారుల సంఖ్య నేటి రోజుల్లో భారీగా పెరిగింది. కారు ఇప్పుడు జీవితంలో ఒక భాగంగా మారిపోయింది. ఈ నేపథ్యంలో కారు కొనుగోలు చేసే సమయంలో మోడల్‌, ఫీచర్లతో పాటు వాస్తు చిట్కాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని జ్యోతిష్కులు సూచిస్తున్నారు. ఈ చిట్కాలు కారు యజమానులకు శుభఫలితాలను అందించడం మాత్రమే కాకుండా, అనుకోని ఇబ్బందులను కూడా నివారిస్తాయని నిపుణులు చెబుతున్నారు.

ఇల్లు, కారు కొనడం చాలా మందికి కలలాంటిది. ఈ కలను నెరవేర్చుకోవడానికి ప్రజలు ఎంత కష్టమైన పడుతున్నారు. ఒకప్పుడు కొంతమందికే పరిమితమైన కారు, నేడు దాదాపు ప్రతి ఇంటిలో కనిపిస్తోంది. స్టేటస్ సింబల్‌గా మారిన కారును కొనుగోలు చేసే సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడమే కాకుండా, వాస్తు సూచనలను పాటించడం ద్వారా మరింత శుభం కలుగుతుందని జ్యోతిష్కులు అంటున్నారు.

కారు కొన్న తర్వాత కొన్ని ముఖ్యమైన విషయాలను విస్మరిస్తారని నిపుణులు చెబుతున్నారు. వాస్తు శాస్త్రం ప్రకారం కారులో కొన్ని ప్రత్యేక వస్తువులను ఉంచడం ద్వారా ప్రతికూల శక్తులు తగ్గి, రాబోయే సమస్యలు నివారించబడతాయని విశ్వాసం. ఈ చిన్న చర్యలు కష్టాలను దూరం చేసి, జీవితంలో ఆనందాన్ని పెంచుతాయని పండితులు సూచిస్తున్నారు.

కారులో దేవతల విగ్రహాలు ఉంచడం చాలా మంది చేస్తారు. అయితే వాస్తు ప్రకారం గణపతి చిన్న విగ్రహాన్ని కారులో ఉంచడం అత్యంత శుభప్రదం అని చెబుతారు. గణేశుడు కేతుతో సంబంధం కలిగి ఉండడం వల్ల ప్రమాదాలు, అడ్డంకులు తొలగుతాయని విశ్వాసం. అదే విధంగా గాలిలో వేలాడే హనుమంతుడి విగ్రహాన్ని కారులో ప్రతిష్ఠించడం ప్రయాణ సమయంలో ఎదురయ్యే కష్టాలను దూరం చేస్తుందని భావిస్తారు.

అదే సమయంలో, కారులో చిన్న బాటిల్ ఎసెన్షియల్ ఆయిల్ ఉంచుకోవడం కూడా వాస్తు ప్రకారం సానుకూలతను పెంచే చర్యగా పరిగణించబడుతోంది. దీని వాసన మనసును ప్రశాంతంగా ఉంచడమే కాకుండా ప్రయాణికులలో అలసటను తగ్గిస్తుంది. అలాగే తాబేలు బొమ్మను కారులో ఉంచడం ప్రతికూల శక్తిని తొలగించి, ఇంటికి, వాహనానికి సానుకూల శక్తిని అందిస్తుంది.

కారులో ఉంచకూడని వస్తువుల విషయంలో జ్యోతిష్కులు ప్రత్యేకంగా హెచ్చరిస్తున్నారు. విరిగిన వస్తువులను, పనికిరాని సామాను కారులో ఎప్పుడూ ఉంచకూడదని సూచిస్తున్నారు. అలాగే కారు కిటికీలు, కార్పెట్, సీట్లను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచితే, మనస్సు ప్రశాంతంగా ఉండడమే కాకుండా వాస్తు పరంగా కూడా శుభఫలితాలు కలుగుతాయని చెబుతున్నారు.

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana
వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana