DNews:20 Nov:వరంగల్‌,విపత్తులు సంభవించినప్పుడు ప్రజల ప్రాణాలు కాపాడే డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (DRF) సిబ్బంది, మూగజీవుల పట్ల కూడా తమ వృత్తి ధర్మాన్ని, మానవత్వాన్ని చాటుకున్నారు. వరంగల్ జిల్లాలో ప్రమాదవశాత్తు ఇరుక్కుపోయిన ఓ వీధి కుక్క ప్రాణాలను కాపాడి వరంగల్ DRF టీం స్థానికుల ప్రశంసలు అందుకుంది.ఈ విచిత్ర సంఘటన వరంగల్ జిల్లా, సంగెం మండలం రామ‌చంద్రపురం గ్రామంలో జరిగింది. ఓ వీధి కుక్క ఇంటి ముందు ఉన్న గేట్ గ్రిల్స్‌లోంచి బయటకు వెళ్లే ప్రయత్నంలో, దాని తల ఆ గ్రిల్స్‌లో ఇరుక్కుపోయింది. ముందుకు వెళ్లలేక, వెనక్కి రాలేక దాదాపు మూడు గంటలకు పైగా ఆ కుక్క నరకం అనుభవించింది. ఆపదలో ఉన్న ఆ కుక్క అరుపులు విని కాలనీ వాసులు బయటకు వచ్చి, దాన్ని కాపాడేందుకు మార్గం కనిపించక, GWMC పరిధిలో పనిచేస్తున్న DRF టీమ్‌కు ఫోన్ చేశారు.

సమాచారం అందుకున్న DRF సిబ్బంది వెంటనే స్పందించి, ప్రత్యేక వాహనంలో ఘటనా స్థలానికి చేరుకున్నారు. మూగజీవిని కాపాడేందుకు రంగంలోకి దిగిన సిబ్బంది, దాదాపు రెండు గంటలకు పైగా శ్రమించారు. చివరకు కట్టర్‌ సహాయంతో గేట్ గ్రిల్స్‌ను జాగ్రత్తగా కట్ చేసి, ఆ శునకాన్ని సురక్షితంగా బయటకు తీసి దానికి విముక్తి కల్పించారు

ప్రజల ప్రాణాలకే కాదు, మూగ జీవుల ప్రాణాలకు కూడా విలువనిచ్చి, ఆ వీధి కుక్క ప్రాణాలు కాపాడిన DRF టీం సిబ్బందిని గ్రామస్తులు, స్థానికులు అభినందించారు. చిన్న ప్రాణి, పైగా వీధి కుక్క…అయినా సరే, వారు చూపిన మానవత్వంపై ప్రశంసలు కురిపించారు.

By rajesh

పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana పుదీనాతో చేసే ఆరోగ్యకర వంటలు | Healthy recipes made with mint-DTv Telangana బ్రెడ్ తో టేస్ట్ అదిరే రెసిపీస్ | Tasty recipes with bread-DTv Telangana శక్తిని పెంచే హోమ్మేడ్ డ్రింక్స్ | Homemade energy-boosting drinks-DTv Telangana