DNews: Nov 20: కామారెడ్డి జిల్లాలోని బాన్సువాడ మండలానికి చెందిన నెమ్లి గ్రామానికి చెందిన 70 ఏళ్ల చిట్టె వీరయ్య అనే వృద్ధుడు తన కుమార్తె పెళ్లి బాధ్యతలతో తీవ్ర మనోవేదనకు గురై ఆత్మహత్య చేసుకున్న విషాదకర ఘటన చోటుచేసుకుంది. గత ఐదేళ్లుగా కుమార్తెకు మంచి వరుడు చూసి పెళ్లి చేయాలని ప్రయత్నిస్తున్న వీరయ్య, వరకట్న సమస్యల కారణంగా సంబంధాలు ముందుకు సాగకపోవడంతో తీవ్ర నిరాశకు లోనయ్యాడు. కుటుంబాన్ని పోషించేందుకు వచ్చే ఆదాయం కూడా సరిపోక, పెళ్లి ఖర్చులకు డబ్బు కూడబెట్టలేకపోయాడు. ఈ నేపథ్యంలో గత కొన్ని రోజులుగా తీవ్ర మానసిక ఒత్తిడిలో ఉన్న వీరయ్య, ఊహించని నిర్ణయం తీసుకుని గ్రామ శివారులోని అడవిలో ఉన్న చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు ముందు రాసిన సూసైడ్ నోట్‌లో తన ఆత్మహత్యకు కారణాలు వివరించాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ విషాద ఘటన ప్రతి తండ్రి మనసును కలచివేస్తోంది – ఏ తండ్రికీ ఇలాంటి పరిస్థితి ఎదురుకాకూడదని అనిపించేలా ఉంది.

By Mosha

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana