D Spiritual: Nov 19: పూజకు ముఖ్య ఆధారం దీపారాధన. అటువంటి దీపం ఆరిపోవడం, కొండెక్కడం లాంటివి జరిగినప్పుడు అనర్థాలు చోటుచేసుకుంటాయనిది పురాణాల ప్రకారం వాస్తవం. దీపం వెలిగించడంలో తగిన జాగ్రత్తలు పాటిస్తేనే ఫలితం పొందగలము, లేనిపక్షంలో లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి కావాల్సిందే.

దీపాన్ని ఉదయం అయితే ఐదు గంటల నుండి 10 గంటల లోపు మాత్రమే వెలిగించాలి. అదే సాయంత్రం అయితే ఐదు నుండి 7 గంటల లోపు మాత్రమే వెలిగించాలి. ఏవైనా ప్రత్యేక పూజలు ఉంటేనే రాత్రిపూట దీపం వెలిగించాలి. మిగతా సమయాలలో దీపం వెలిగించడం మంచిది కాదని శాస్త్రం చెబుతుంది.

దీపానికి ఆవు నెయ్యి అత్యుత్తమం. అది అందుబాటులో లేనప్పుడు ఆముదం లేదా నువ్వుల నూనెను వాడవచ్చు. వేరుశెనగ నూనెను దీపారాధనలో వాడరాదు. దీపం వెలిగించిన తర్వాత దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ దక్షిణ దిశలో ఉంచకూడదు. అలా చేస్తే అమ్మవారికి కోపం వస్తుందని విశ్వాసం. తూర్పు లేదా ఉత్తర దిశల వైపు దీపం ఉంచితే ఆ ఇంటికి సిరిసంపదలు, సుఖశాంతులు వస్తాయని నమ్మకం.

దీపాన్ని నేలపై ఉంచకుండా ఏదైనా ఆకు లేదా ప్లేట్‌లో పెట్టి, అందులో ఒక నాణెం వేయడం శ్రేయస్కరం. దీపం ఆరిపోకుండా, కొండెక్కకుండా ప్రత్యేక జాగ్రత్త వహించాలి. ఇంట్లో పిల్లలకు దిష్టి తగిలినట్లు అనిపిస్తే, ఆ ప్లేట్‌లో వేసిన నాణెాన్ని స్నాన నీటిలో వేయి ఆ నీటితో స్నానం చేయిస్తే దిష్టి తగ్గుతుందని చెబుతారు.

దీపాన్ని ఉదయం, సాయంత్రం శుభ్రం చేసిన తర్వాత కొత్త వత్తులతోే వెలిగించాలి. అప్పుడు మాత్రమే పూజ పరిపూర్ణం అవుతుంది. పూజ చేసేటప్పుడు దీపం మనకు ఎడమ వైపున ఉండాలి. దీపారాధనకు ఉపయోగించే కుందలు విరిగినవి, పాడైనవి కాకూడదు. ఇత్తడి, రాగి, మట్టితో చేసిన కుందలు ఏవైనా వాడవచ్చు.

ఈ విధంగా శాస్త్రంలో చెప్పిన నియమాలు పాటిస్తూ దీపారాధన చేస్తే ఎటువంటి హాని లేకుండా కుటుంబం సుఖశాంతులతో, సిరిసంపదలతో జీవిస్తుందనే విషయాన్ని పురాణాలు స్పష్టం చేస్తున్నాయి.

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana
వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana