D Spiritual: Nov 19: భారతదేశంలో ఎన్నో అద్భుతమైన ఆలయాలున్నాయి. రహస్యాలను దాచుకున్న కొన్ని ఆలయాలు నేటికీ మానవ మేధస్సుకు అందని మిస్టరీలు గా నిలిచాయి. అలాంటి ఆలయాలు బ్రిటిష్ పాలకులనుకూడా దణ్ణం పెట్టించాయి. అలాంటి ఓ గణపతి ఆలయంలో జరిగిన విశేష సంఘటన ఒక బ్రిటిష్ గవర్నర్‌ను ఆశ్చర్యపరిచింది. ఆ ఘటన అతన్ని భక్తునిగా మార్చింది. ఆ సంఘటన ఏమిటి? ఆ గణపతి ఆలయ రహస్యం ఏమిటి? విగ్రహ ప్రతిష్ఠ సమయంలో ఏమి జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.

సంస్కృతి, వాస్తుశిల్పాలకు నెలవైన దేవాలయాల రాష్ట్రం తమిళనాడులోని తిరునల్వేలి జిల్లాలో కుర్తాళంలో ఒక గణపతి ఆలయం అనేక రహస్యాలను దాచుకుంది. ఇక్కడ ఉన్న వినాయకుడిని ‘నాడి గణపతి’ అని పిలుస్తారు. ఇలా పిలవడానికి కూడా ఒక ప్రత్యేక కథ ఉంది. ఈ ప్రాంతంలో తపస్సు చేయడానికి నిర్ణయించుకున్న మహా సిద్ధయోగి మౌనస్వామి ఒక మఠాన్ని ఏర్పాటు చేశారు. అలాగే శ్రీ సిద్దేశ్వరి అమ్మవారిని ప్రతిష్ఠించారు. అనంతరం ఇక్కడ వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ప్రాణ ప్రతిష్ఠ చేయాలని భావించారు.

ఈ విషయం తెలిసిన అప్పటి బ్రిటిష్ పాలనలో మద్రాస్ గవర్నర్ అయిన ఎడ్వర్డ్ రాతి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ అంటే ఏమిటి అంటూ హేళన చేశాడు. అప్పుడు సిద్ధయోగి, ఒక వైద్యుడిని పిలిపించమని గవర్నర్‌కు చెప్పారు. గవర్నర్ పిలిపించిన వైద్యుడితో, మౌనస్వామి గణపతి విగ్రహానికి ముందుగా నాడి చూడమని అన్నారు. వైద్యుడు కూడా “రాతి విగ్రహానికి నాడి ఎలా ఉంటుంది?” అని అనుకుంటూ పరీక్షించగా, నాడి శబ్దం ఏమీ వినిపించలేదు.

తరువాత మౌనస్వామి గణపతి విగ్రహానికి సంప్రదాయ ప్రకారం ప్రాణ ప్రతిష్ఠ జరిపారు. ప్రాణ ప్రతిష్ఠ అనంతరం వైద్యుడిని మళ్లీ నాడి చూడమని కోరారు. అప్పుడు వైద్యుడు స్టెతస్కోప్‌తో పరిశీలించగా, గణపతి విగ్రహంలో మనిషిలా నాడి కొట్టుకోవడం స్పష్టంగా వినిపించింది. ఈ విషయం విని అక్కడున్న గవర్నర్ సహా అందరూ ఆశ్చర్యంలో మునిగిపోయారు.

ఈ అద్భుతాన్ని చూసిన బ్రిటిష్ గవర్నర్, డాక్టర్ ఇద్దరూ వినాయకుడికి నమస్కరించి, మౌనస్వామి నుంచి ఆశీర్వాదం తీసుకొని వెళ్లిపోయారు. అప్పటి నుండి ఈ వినాయకుడిని ‘నాడి గణపతి’ అని పిలుస్తున్నారు. ఇక్కడ గణపతి తొడల దగ్గర నుంచే నాడి శబ్దం వినిపిస్తుందని చెబుతారు. అందుకే స్వామివారి విగ్రహపు తొడలు కనిపించకుండా ధోతీ కట్టడం ఆనవాయితీ.

ప్రకృతి ఒడిలో వెలసిన ఈ మహిమ గల వినాయక ఆలయానికి వినాయక చవితి సమయంలో భారీగా భక్తులు వస్తారు. ఇక్కడ నాడి గణపతిని, మౌనస్వామి మఠాన్ని, శ్రీ సిద్దేశ్వరి పీఠాన్ని దర్శించుకుని, దగ్గర్లోని జలపాతంలో స్నానం చేసి వెళ్తారు. ఇక్కడ మఠం, పీఠం, గణపతి ఆలయం, అద్భుత జలపాతాలు ప్రత్యేక ఆకర్షణలు. కుర్తాళంలోని చిత్రావతి జలపాతం నీటికి అనేక ఔషధ గుణాలున్నాయని, అది ఎన్నో రోగాలను నయం చేస్తుందని నమ్మకం.

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana
వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana