D Spiritual: Sep 13: హిందూ సంప్రదాయం ప్రకారం విశిష్టమైన పండుగల్లో దీపావళి పండుగ కూడా ఒకటి. కుల మతాలకు అతీతంగా అందరూ కలిసి వేడుకగా జరుపుకునే ఈ దీపావళి పండుగ ఈ ఏడాది ఏతేదీన వచ్చిందో తెలుసుకుందాం..


దీపావళి పండుగ అంటే దీపాలు వెలిగించడం, టపాసులు కాల్చడం, స్వీట్లు, పిండి వంటలు తినడం ఇది దాదాపు అన్నీ ఇళ్లలో జరిగే ఆచారమే. దీపావళి అంటే దీపాల వరుస అని అర్థం. చీకటిని పారదోలి వెలుగును ఇచ్చే ఆయుధమే దీపం అని పండితులు చెబుతారు. అలాగే.. చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నంగా ఎంతో ఘనంగా జరుపుకునే పండుగ. ఇంట్లో ప్రతికూల శక్తులను తొలగించి కొత్త వెలుగులు తీసుకొచ్చే అందమైన, విశిష్టమైన పండుగ దీపావళి (Diwali). హిందువులతో పాటు జైనులు, సిక్కులు, బౌద్ధులు ఇలా ఇతర మతస్తులు సైతం అన్యోన్యంగా జరుపుకునే పండుగ దీపావళి. ప్రతియేటా ఈ పండుగను 5 రోజులు పాటు జరుపుకుంటారు.

🎆 2025 లో దీపావళి తేదీ:

🔸 తేదీ: అక్టోబర్ 20, 2025 (సోమవారం)
🔸 పర్వదినం: అమావాస్య – కార్తీక మాసం

🪔 దీపావళి ఎందుకు జరుపుకుంటాం?

దీపావళి పండుగ అనేది ధర్మంపై అధర్మానికి విజయం, అంధకారంపై వెలుగుదీసే ఆశయానికి గుర్తుగా జరుపుకుంటారు. ఇది శ్రీరాముడు లంకను జయించి, అయోధ్యకు తిరిగి వచ్చిన సందర్భాన్ని గుర్తుచేస్తుంది. అలాగే లక్ష్మీదేవిని పూజించే పర్వదినం కూడా ఇదే.

📌 దీపావళి ముఖ్యమైన అంశాలు:

  1. అక్టోబర్‌ 19 ఆదివారం నరక చతుర్దశి – దీపావళికి ముందు రోజు (ఒకరి యమ పూజ)
  2. అక్టోబర్‌ 20 సోమవారం అమావాస్య – లక్ష్మీ పూజ, ప్రధాన దీపావళి పండుగ
  3. అక్టోబర్‌ 21 మంగళవారం గోవర్ధన పూజ,
  4. అక్టోబర్‌ 22 బుధవారం – భాయ్ దూజ్‌ భాయ్ దూజ్ (తమ్ముడికి అక్కచెల్లెళ్ల ప్రేమ గుర్తుగా)

ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా..

అయితే.. ఈ దీపావళి పండుగను ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా జరుపుకుంటారు. ఉత్తర భారతదేశంలో 5 రోజులు పండుగ జరుపుకుంటారు. అదే దక్షిణ భారత దేశంలో 2 రోజులు మాత్రమే జరుపుకుంటారు. అందులోనూ ప్రధానంగా లక్ష్మీపూజ రోజు ఘనంగా జరుపుకుంటారు. అలాగే.. గుజరాత్ రాష్ట్రంలో అయితే ఈ దీపావళి పండుగ రోజునే కొత్త వ్యాపారాలు ప్రారంభించడం ఆనవాయితీగా వస్తోంది. అలాగే.. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో లక్ష్మీదేవి భర్త శ్రీహరి (విష్ణుమూర్తి) ఆశ్వయుజ మాసంలో అమావాస్య రోజున భూలోకానికి వచ్చాడని.. ఆయనకు స్వాగతం పలికేందుకే టపాసులు కాలుస్తూ.. దీపావళి పండుగను ఘనంగా జరుపుకుంటారు. ఇక కలకత్తాలో అయితే దీపావళి రోజున కాళీ పూజ అత్యంత వైభవంగా చేస్తారు.

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana
వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana