D Spiritual: Nov 19: పూజా: పీరియడ్స్ తర్వాత 5వ రోజు స్త్రీలు దీపారాధన చేయవచ్చా?: పీరియడ్స్ వచ్చి తర్వాత 5వ రోజున స్త్రీలు ఇంట్లోనే పూజ మందిరంలో దీపారాధన చేయవచ్చా చేయకూడదా? ఈ విషయం గురించి పండితులు ఏమంటున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

పూజా: పీరియడ్స్ తర్వాత 5వ రోజు స్త్రీలు దీపారాధన చేయవచ్చా?: మామూలుగా స్త్రీలకు ప్రతి నెల పీరియడ్స్ రావడం సహజం. అయితే పీరియడ్స్ వచ్చినప్పుడు స్త్రీలు దాదాపు ఐదు రోజుల పాటు పూజ గదికి దూరంగా ఉంటారు. పూజలు చేయడం తప్ప, పూజ గది వైపు వెళ్లడం లేదా పూజా సామాగ్రి ముట్టుకోవడం కూడా చేయరు. మరి పీరియడ్స్ వచ్చిన తర్వాత రోజు స్త్రీలు పూజ గదిలో దీపారాధన చేయవచ్చా చేయకూడదా అనేది తెలుసుకోవాలి.

పీరియడ్స్ వచ్చిన తర్వాత మొదటి మూడు రోజులు పూజ చేయడం మంచిది కాదని చెబుతున్నారు. మామూలు దీపారాధన కూడా ఆ రోజుల్లో చేయకపోవడం మంచిదట. అలాగే సూర్యనమస్కారాలు వంటి శారీరక సాధానలు కూడా ఈ సమయంలో చేయకూడదని అంటారు. మూడు రోజులు పూర్తైన తర్వాత, నాలుగవ రోజు తలస్నానం చేయాలి. ఇక ఐదవ రోజు మారు స్నానం చేసిన తర్వాత మాత్రమే పూజగదిలోకి వెళ్లాలని సూచిస్తున్నారు.

ఐదవ రోజు మారు స్నానం చేసిన తర్వాత ఇంట్లోనే పూజ గదిలోకి వెళ్లి దీపారాధన చేయవచ్చని పండితులు చెబుతున్నారు. అదేవిధంగా ఎవరైనా వాయనానికి పిలిచినా కూడా ఐదవ రోజునే వెళ్లాలని అంటారు. ఐదవ రోజును తప్ప మిగిలిన నాలుగు రోజులు పనికిరావని, ఆ నాలుగు రోజుల్లో అలాంటి పవిత్ర కార్యాలు చేయకూడదని చెబుతున్నారు. ముఖ్యంగా ఈ నాలుగు రోజులపాటు తులసి మొక్కను తాకడం, తులసి దళాలు కోయడం, తులసికి నీరు సమర్పించడం వంటి పనులు అస్సలు చేయవద్దని అంటారు. ఒక మాటలో చెప్పాలంటే దేవుళ్లకు సంబంధించిన ఏ పని కూడా ఈ నాలుగు రోజుల్లో చేయకూడదట.

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana
వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana