D Spiritual: Nov 19: జ్యోతిష్య శాస్త్రంలో వాస్తు శాస్త్రానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. చాలా మంది వాస్తు విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉంటారు. ఇంటిలో ప్రతి ఒక్కరూ తులసి మొక్కను పూజిస్తుంటారు. అయితే తులసి మొక్క ఎండిపోతే చాలామంది భయపడిపోతారు. తులసి ఎండిపోతే ఏదో నష్టం జరుగుతుందేమో, కీడు వాటిల్లుతుందేమో అని భయపడే వారు కూడా ఉంటారు. కానీ ఎండిపోయిన తులసి మొక్క వలన కూడా లక్ష్మీదేవి అనుగ్రహం పొంది ఇంటిలో సంపద పెంపొందించుకోవచ్చని చెబుతారు. అది ఎలా అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

హిందూ సంప్రదాయంలో తులసి మొక్కకు ఎంతో ప్రత్యేకత ఉంది. ఈ మొక్కను అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. తులసి మొక్క ఎండిపోతే చాలా మంది అది పనికిరాదు అనుకుంటారు. కానీ ఎండిపోయిన తులసికి కూడా కొన్ని ప్రత్యేక ప్రయోజనాలు ఉన్నాయని చెబుతారు. ఎండిన తులసి నివారణలు పాటించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభించి, వాస్తుప్రకారం ఇంటిలో సంపద పెరుగుతుందని నమ్మకం.

తులసి నిమజ్జనం విషయంలో చాలామంది ఎండిపోయిన తులసి మొక్కను పారేసి వేస్తారు లేదా కాల్చేస్తారు. కానీ అలా చేయకూడదని పండితులు సూచిస్తున్నారు. ఎండిన తులసి మొక్కను నది లేదా చెరువులో నిమజ్జనం చేయడం వలన అష్టైశ్వర్యాలు లభిస్తాయని అంటారు. ఒకవేళ ఎండిన తులసిని అపవిత్ర ప్రదేశాల్లో పారేసి వేస్తే అది ఇల్లుకు అనేక సమస్యలను తెస్తుందని చెబుతారు.

వాస్తు శాస్త్రం ప్రకారం ఎండిన తులసి కూడ పవిత్రమే. ఎండిన తులసి కొమ్మలను యజ్ఞం లేదా హవన అగ్నిలో ఉపయోగించవచ్చు. అగ్నిలో వేసినప్పుడు దాని నుంచి వచ్చే పొగ పర్యావరణాన్ని శుద్ధి చేస్తుందని, ఇంటిలో శాంతి నెలకొల్పుతుందని పండితులు తెలిపారు.

కొంతమంది తులసి చెట్టు ఎండిపోయిందని దానికి పూజ చేయడం, దీపం వెలిగించడం మానేస్తారు. కానీ ఎండిపోయిన తులసి మొక్క స్థానంలో కూడా దీపం వెలిగించడం, క్రమం తప్పకుండా పూజ చేయడం లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమని చెబుతారు. వాస్తు ప్రకారం ఇదివల్ల ఇంటిలో ధనసంపద పెరుగుతుందని పండితులు సూచిస్తున్నారు.

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana
వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana