D Spiritual: Nov 17: వాస్తు ప్రకారం మన ఇంట్లో కొన్ని వస్తువులను పొరపాటున కూడా ఉంచరాదని పండితులు సూచిస్తున్నారు. ఎందుకంటే ఇవి ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీని ఆకర్షించడమే కాకుండా వాస్తు దోషాలకు కూడా కారణమవుతాయని చెబుతారు. ముఖ్యంగా ఈ ఐదు రకాల వస్తువులను ఇంట్లో ఉంచితే అనేక సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. అందుకే వీటిని వెంటనే ఇంటి నుండి తొలగించడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.

అందులో మొదటగా ఆగిపోయిన గడియారం. ఇంట్లో పనిచేయని, ఆగిపోయిన గడియారం ఉంచడం వాస్తు ప్రకారం చాలా అశుభంగా భావిస్తారు. ఆగిపోయిన గడియారం నెగటివ్ ఎనర్జీని తీసుకొస్తుందని, ఆర్థిక సమస్యలు, చెడు ఫలితాలు కలిగిస్తుందని నమ్మకం ఉంది. అదేవిధంగా ఇంట్లో చిరిగిపోయిన వస్తువులు, వాడకుండా చాలా రోజులుగా ఉన్న పాతసామాన్లు, పాడైపోయిన పాత్రలను కూడా ఇంట్లో ఉంచకూడదు. వీటి వలన సంతోషం తగ్గి, అశాంతి పెరుగుతుందని చెబుతారు.

తదుపరి, చనిపోయిన వారి పాత ఫోటోలు, వారు ఉపయోగించిన వస్తువులను ఇంట్లో ఉంచడం కూడా వాస్తు పరంగా శ్రేయస్కరం కాదు. ఇవి ఇంట్లో ప్రతికూల శక్తులను తీసుకురావడమే కాకుండా అనేక సమస్యలకు దారితీస్తాయని చెప్పబడింది. అలాగే పాత వార్తాపత్రికలు, అవసరం లేని పేపర్లు ఇంట్లో పేరుకుపోయి ఉంటే ప్రతికూల శక్తులు పెరిగే అవకాశం ఉంటుంది. ఇవి కొన్నిసార్లు దురదృష్టాన్ని కూడా తీసుకువస్తాయని చెబుతారు.

అలాగే పగిలిపోయిన వస్తువులు, విరిగిపోయిన విగ్రహాలను ఇంట్లో ఉంచడం పూర్తిగా వాస్తు దోషానికి కారణమవుతుంది. పగిలిన విగ్రహాలు నెగిటివ్ ఎనర్జీని ఆకర్షించి ఇంట్లో ప్రతికూల పరిస్థితులు కలిగిస్తాయని నమ్మకం ఉంది. కాబట్టి ఇంట్లో ఇలాంటి పగిలిన వస్తువులు ఏవైనా ఉంటే వెంటనే వాటిని తొలగించడం మంచిదని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు.

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana
వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana