
DNews: 12 Sep: FMCGలో లీడింగ్ కంపెనీ అయినా రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ రూ. 1500 కోట్ల పెట్టుబడి తో ఆహార ఉత్పత్తులు మరియు పానీయాలు తయారు చేసేందుకు ఒక కొత్త ఇంటిగ్రేటెడ్ ప్లాంట్ ను మహారాష్ట్ర లోని నాగపూర్ లో నిర్మించనుంది. వైవిధ్యభరితమైన దిగ్గజ రిలయన్స్ పరిశ్రమల FMCG విభాగమైన రిలయన్స్ కన్స్యూమర్, ఈ యూనిట్ స్థాపన కోసం మహారాష్ట్ర ప్రభుత్వంతో ఒక మెమోరాండం ఆఫ్ అసోసియేషన్ (MoU)పై సంతకం చేసింది.
దాదాపు 500 మందికి ఈ యూనిట్ ఉద్యోగ అవకాశాలు కల్పించబోతుంది. ఈ ఇంటిగ్రేటెడ్ యూనిట్ 2026లో కార్యకలాపాలు ప్రారంభించే అవకాశం ఉంది. గత నెలలో జరిగిన వార్షిక సర్వసభ్య సమావేశం (AGM) లో ఇంటిగ్రేటెడ్ ఫుడ్ పార్కుల ఏర్పాటుకు రూ.40,000 కోట్లు ఖర్చు చేయనున్నట్లు రిలయన్స్ చైర్మన్ ముఖేష్ అంబానీ ప్రకటించారు.ఇది AI- ఆధారిత ఆటోమేషన్, రోబోటిక్స్ మరియు ఆధునిక టెక్నాలజీలతో ఆసియాలో అతిపెద్ద ఫుడ్ పార్క్ అవుతుంది అని ఆయన పేర్కొన్నారు. రిలయన్స్ రిటైల్ నుండి ఉద్భవించిన రిలయన్స్ కన్స్యూమర్ మూడు సంవత్సరాలలో రూ.11,000 కోట్ల టర్నోవర్ సాధించిందని ఆయన సమావేశంలో తెలిపారు.
