
DNews: 12 Sep: ప్రముఖ ఐటీ కంపెనీ TCS దేశీయ సెమీకండక్టర్ పరిశ్రమ కోసం కొత్త చిప్లెట్ ఆధారిత ఇంజనీరింగ్ సేవను అభివృద్ధి చేసింది. ఈ చిప్లెట్ ఆధారిత ఇంజనీరింగ్ సేవలు భారతదేశంలో సెమీకండక్టర్ తయారీకి ప్రపంచ కేంద్రంగా మారడానికి సహాయపడతాయి. ఈ రంగం లో కొత్త ఆవిష్కరణలను రూపొందించేందుకు ఉపయోగపడుతుంది అని కూడా చెప్తున్నారు.
గత ఆర్థిక సంవత్సరంలో $45 బిలియన్ నుండి $50 బిలియన్ల విలువైన భారతీయ సెమీకండక్టర్ మార్కెట్ 2030 నాటికి $100 బిలియన్ నుండి $110 బిలియన్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. ఇలాంటి కొత్త రకం సర్వీస్ ను అందించడం వల్ల ఇండియన్ సెమీకండక్టర్ ఇండస్ట్రీ కి కీలకమైన సమయం లో చాలా బలంగా ఉపయోగపడుతుంది అని TCS – ప్రెసిడెంట్ (టెక్నాలజీ, సాఫ్ట్వేర్ మరియు సర్వీసెస్) వి. రాజన్న గారు పేర్కొన్నారు.
