
D Spiritual: Nov 12: భక్తి చిట్కాలు:
మన హిందూ సాంప్రదాయాల ప్రకారం పసుపు, కుంకుమలను ఎంతో పవిత్రంగా భావిస్తారు. పసుపు కుంకుమలు ముత్తయిదువులు మరింత గౌరవంగా పరిగణిస్తారు. అందువల్ల వీటికి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది.
కుంకుమ కింద పడితే?
కొన్నిసార్లు పొరపాటున చేయి జారి పసుపు లేదా కుంకుమ కింద పడుతుంది. అప్పుడు చాలామంది మనసులో భయం కలుగుతుంది — “ఏదైనా చెడు జరగబోతోందా?”, “ఇది అశుభ సంకేతమా?” అని అనుమానం వస్తుంది.
శుభమా? అశుభమా?
సాధారణంగా మనం ఏదైనా శుభకార్యాలు చేస్తున్నప్పుడు లేదా ప్రయాణాలకు బయలుదేరే సమయంలో కుంకుమ కింద పడితే అశుభమని చాలామంది భావిస్తారు. కానీ పండితుల అభిప్రాయం మాత్రం భిన్నంగా ఉంటుంది. వారు చెబుతున్నది — పూజా కార్యక్రమాల సమయంలో లేదా బయలుదేరే సమయంలో కుంకుమ కింద పడటం శుభసూచకం అని.
భూదేవి యొక్క సంకేతం.
నేల అంటే సాక్షాత్తు భూదేవి. భూదేవి కూడా సర్వసుమంగళి కనుక, ఏదైనా శుభకార్యం జరుగుతున్నప్పుడు ఆమెకు కూడా పసుపు కుంకుమ సమర్పించాలనే తపన ఉంటుంది. అందుకే కొన్ని సందర్భాల్లో పసుపు కుంకుమ నేలపై పడుతుంది.
అర్థం ఏమిటంటే…
అలా కుంకుమ నేలపై పడటం అంటే సాక్షాత్తు భూదేవికి కూడా మనం పసుపు కుంకుమ సమర్పించినట్టే. కాబట్టి ఇది చెడు సంకేతం కాదు. పండితులు చెబుతున్నట్లుగా, ఇది శుభప్రదమైన సూచనగా పరిగణించవచ్చు.
