
D Spiritual: Nov 12: దేవాలయ దర్శనం అంటేనే పవిత్రం.
దేవాలయ దర్శనం అంటేనే పవిత్రంగా భావిస్తాం. అయితే ఇటీవల చాలామందికి రకరకాల అనుమానాలు కలుగుతున్నాయి. వాటిలో ప్రధానమైనది — దేవాలయానికి వెళ్లే ముందు మాంసాహారం తినవచ్చా? తింటే ఆ రోజు దేవాలయానికి వెళ్లకూడదా? దీని గురించి ఆయా పండితులు చెప్పిన విషయాలు పరిశీలిద్దాం.
ఆహారం మరియు మన ప్రవర్తన.
మన ప్రవర్తన మనం తినే ఆహారం పై ఆధారపడి ఉంటుంది అని పరిశోధనలు చెబుతున్నాయి. మాంసాహారం తమో గుణాన్ని పెంచుతుంది. అలాగే శాకాహారంలో ఉన్న ఉల్లిపాయలు కూడా తమోగుణాన్ని పెంచుతాయి.
మాంసాహారం తిన్న తరువాత దర్శనం చేయవచ్చా?
మాంసాహారం తిన్న తరువాత దైవ దర్శనం చేసుకోకూడదని ఎక్కడా స్పష్టంగా చెప్పలేదు. కానీ ఒక పవిత్ర భావనతో దైవ దర్శనం చేసుకుందాం అని అనుకునే వారు మాంసాహారం తీసుకోకుండా దైవ దర్శనం చేసుకోవడం మంచిది. అసలు ఏ ఆహారం స్వీకరించకుండా (మాంసాహారం / శాకాహారం) దైవ దర్శనం చేసుకోవడం అత్యంత శ్రేయస్కరం.
తమోగుణం ప్రభావం.
తమోగుణం వల్ల మనకు అనేక రకాల దుష్ట ఆలోచనలు వస్తాయి. కామ, క్రోధ భావాలు పెరుగుతాయి. అందుకే పవిత్రమైన స్థలాలకు వెళ్లినప్పుడు ఉపవాసం ఉండి లేదా శుచి, శుభ్రతతో వెలితే ప్రశాంతత, అనుకూలత లభిస్తాయి అనేది శాస్త్రవచనం.
దేవాలయ దర్శనానికి ముందు ఆహార నియమం.
కాబట్టి దేవాలయాలకు వెళ్లేటపుడు ఉదయం అయితే ఏమీ తినకుండా వెళ్లడం ఉత్తమం. ఒకవేళ సాయంత్రం వెళ్లాల్సి వస్తే సాత్విక ఆహారం తీసుకోవడం మంచిది. మద్యం, మాంసం, తమోగుణ ప్రధానంగా ఉండే ఆహారాలను ఆ రోజు స్వీకరించకపోవడం శ్రేయస్కరం.
