D Spiritual: Oct 31: మన హిందూ సాంప్రదాయంలో పూజా విధానానికి చాలా విశిష్టత ఉంది. దేవుని పూజించే సమయంలో భక్తిశ్రద్ధలతో పుష్పాలు, పండ్లు, జలం, నైవేద్యం సమర్పిస్తారు. ఇలా సమర్పించడం వల్ల ఆ దేవుడి అనుగ్రహం లభిస్తుందని ప్రజల నమ్మకం. అయితే పూజ సమయంలో పుష్పాలను ఎందుకు ఉపయోగిస్తారు? పుష్పాలను దేవుడికి సమర్పించడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి చాలామందికి అవగాహన ఉండదు. అసలు పూజలు పుష్పాలు ఎందుకు ఉపయోగిస్తారు? ఆ సమయంలో ఎటువంటి జాగ్రత్తలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

పూజలో దేవునికి సమర్పించే పుష్పం ఏదైనా శుచి శుభ్రతతో ఉండేలా చూసుకోవాలి. అంటే పురిటి వారు, మైలవారు, బహిష్టులైన మహిళలు ఆ పుష్పాలను తాకకుండా జాగ్రత్త వహించాలి. అలాంటి వారు తాకిన పుష్పాలను పొరపాటున కూడా పూజలో ఉపయోగించకూడదు.

అలాగే చెట్టు నుండి రాలిపోయి భూమిపై పడిన పుష్పాలను దేవుడికి సమర్పించకూడదు. అలాగే వాసన చూసిన పుష్పాలు, కడిగిన పుష్పాలను కూడా పూజకు వినియోగించకూడదని వేద పండితులు చెబుతున్నారు.

ప్రతిరోజు స్నానమాచరించిన తర్వాత కోసిన పత్ర పుష్పాలను మాత్రమే పూజా కార్యక్రమాలకు ఉపయోగించాలి. అప్పుడే ఆ పూజా ఫలితం లభిస్తుంది.

అయితే కొన్ని దేవుళ్లను పువ్వులతో కొన్ని రకాల పత్రాలతో పూజిస్తారు. మహా శివునికి మారేడు దళాలలు ఎంతో ఇష్టమైనవి. అందువల్ల శివుని పూజలు పువ్వులు లేకపోయినా, మారేడు దళాలు మాత్రం తప్పనిసరిగా ఉండాలి.

అలాగే విష్ణు భగవానుడిని పూజించేటప్పుడు ఆయనకు ఇష్టమైన తులసి దళాలు సమర్పించి పూజించాలి.

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana