D Spiritual: Oct 31: భక్తి చిట్కాలు:
సాధారణంగా ప్రతి రోజూ మన ఇంట్లో ధూపం వేయడం మనం చూస్తుంటాము. అయితే ప్రతిరోజు మన ఇంట్లో ఏదో ఒక సందర్భంలో ధూపం వేయడం వల్ల మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి పాజిటివ్ వాతావరణం ఏర్పడుతుంది. అదేవిధంగా వాస్తు దోషాలు సైతం తొలగిపోతాయి.

మన ఇంట్లో సంపాదించిన డబ్బు నిలకడగా ఉండాలన్నా, వాస్తు దోషాలు తొలగిపోవాలన్నా, ఈ క్రింది తెలిపిన పదార్థాలతో ధూపం వేయడం ఎంతో శుభకరం.

ముఖ్యంగా మనం ప్రతిరోజూ ఉదయం లేదా సాయంత్రం ధూపం వేసేటప్పుడు లవంగం, కర్పూరాన్ని కాల్చి ధూపం వేయడం వల్ల ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. అదే విధంగా మన ఇంట్లో ఉన్న వాస్తు దోషాలు కూడా తొలగిపోతాయి. ఇలా ధూపం వేసి ఇల్లు మొత్తం చూపించి అనంతరం కర్పూర హారతి తీసుకోవాలి. ఇలా చేయటం వల్ల ధన నష్టం కూడా ఉండదు.

అలాగే మార్కెట్లో లభించే గుగ్గుల్ తెచ్చి నిప్పులపై పెట్టడం వల్ల ఇల్లు మొత్తం సువాసనలు వెదజల్లడమే కాకుండా మన ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది. అలాగే ఆవు పిడకపై పసుపు, ఆవాలు వేసి ధూపం వేయడం వల్ల ఇంట్లో అనారోగ్య సమస్యల నుంచి విముక్తి పొందవచ్చు.

ఇక ఇంట్లో మనం సంపాదించిన డబ్బు నిలబడకపోతే, అగరబత్తి ధూపం వేసి ప్రతి శుక్రవారం అమ్మవారి ఆలయానికి వెళ్లి అమ్మవారికి పూజలు చేసి నమస్కరించాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఏర్పడటమే కాకుండా, వాస్తు దోషాలు సైతం తొలగిపోతాయి.

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana