
D Spiritual: Oct 31: మామూలుగా మనం ఆలయాలకు వెళ్ళినప్పుడు దేవుడి హుండీలో డబ్బులు వేస్తూ ఉంటాము. అలాగే గుడి బయట బిక్షాటన చేసే బిక్షగాళ్లకు కూడా మనకు తోచినంతలో సహాయం చేస్తూ ఉంటాము. అయితే కొందరు ఆలయంలో ఉండే పూజారులకు కూడా దక్షిణ ఇస్తూ ఉంటారు. మరి ఈ విధంగా పూజారులకు దక్షిణ ఇవ్వాలా? ఇస్తే ఏం జరుగుతుందో, ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
పూజారికి దక్షిణ ఇవ్వడం యొక్క ప్రాముఖ్యత
పూజారికి దక్షిణ ఇవ్వడం అన్నది తప్పనిసరి కాకపోయినా, అది సంస్కృతి, భక్తి, ధర్మబద్ధమైన చర్య అని గుర్తించాలి. దేవాలయాలలో పూజారులు నిత్యం సేవ చేస్తూ ఉంటారు. వారు పూజలు, హోమాలు, వ్రతాలు మొదలైన వాటిని ఎంతో భక్తితో నిర్వహిస్తారు. కాబట్టి అటువంటి వారి సేవలను గౌరవిస్తూ, మన ఆర్థిక స్థోమతను బట్టి దక్షిణ ఇవ్వడం అన్నది ఒక మంచి పరంపరగా కొనసాగుతుంది.
పూర్వం కాలంలో దక్షిణా సంప్రదాయం
ఇదివరకటి రోజుల్లో, అనగా రాజుల కాలంలో, వారి సామర్థ్యానికి తగ్గట్టుగా పూజారులకు, దేవాలయాలకు దక్షిణ ఇచ్చేవారు. ఆలయ పూజారులు ధర్మాన్ని కాపాడే వారు అని భావించి వారిని సమృద్ధిగా పోషించేవారు.
దక్షిణ ఇవ్వడం – ధర్మం, దానం కాదు
మామూలుగా ఒక అతిధికి భోజనం వడ్డించడానికి వంద రూపాయలు అయ్యే కాలంలో కూడా, పండుగ రోజుల్లో లేదా దేవాలయ దర్శనాల సందర్భంలో పూజారికి 11 లేదా 21 రూపాయలు ఇవ్వడం పెద్ద విషయం కాదు. అయితే గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే — దక్షిణ ఇవ్వడం అన్నది దానం కాదు, అది ధర్మం.
కాబట్టి దేవాలయాలకు వెళ్ళినప్పుడు అక్కడ పూజలు చేసే పూజారులకు మనకు తోచినంత దక్షిణ ఇవ్వడం అన్నది మంచి అలవాటు, భక్తి సూచకం అని పండితులు చెబుతున్నారు.
