
DET:OCT30:
ఇంటర్నేషనల్ స్టార్ డాన్ లీకి ‘స్పిరిట్’లో ఛాన్స్!
ప్రభాస్,సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో వస్తున్న స్పిరిట్ సినిమాకు సంబంధించి ఒక అద్భుతమైన వార్త కొరియా మీడియా ద్వారా బయటకు వచ్చింది.ట్రైన్ టు బుసాన్,మార్వెల్ స్టూడియోస్ ఎటర్నల్స్ వంటి ప్రపంచ స్థాయి సినిమాలతో మెప్పించిన కొరియన్ సూపర్ స్టార్ డాన్ లీ ఈ సినిమాలో కీలక పాత్ర పోషించబోతున్నారట.కొరియన్ ఎంటర్టైన్మెంట్ కమ్యూనిటీ ‘ముకో’ఈ విషయాన్ని ధృవీకరించినట్లు అక్కడి మీడియా కోడై కూస్తోంది.
ప్రభాస్‌తో నేరుగా ఢీ:పవర్ఫుల్ విలన్‌గా డాన్ లీ!
కొరియా మీడియా కథనం ప్రకారం,స్పిరిట్ ఒక డార్క్-టోన్డ్ డిటెక్టివ్ క్రైమ్ డ్రామాగా రూపొందుతోంది.ఇందులో డాన్ లీ పాత్ర,ప్రభాస్ పోషిస్తున్న పవర్ఫుల్ ఐపీఎస్ ఆఫీసర్ పాత్రకు పూర్తి వ్యతిరేకమైనది అని తెలుస్తోంది.ప్రపంచవ్యాప్తంగా భారీ ఫ్యాన్ బేస్ ఉన్న డాన్ లీ ఇండియన్ సినిమాలో అడుగు పెట్టడం ఇదే తొలిసారి. తన యాక్షన్, స్క్రీన్ ప్రెజెన్స్ తో ప్రేక్షకులను మెప్పించే డాన్ లీ..రెబల్ స్టార్ ప్రభాస్‌తో తలపడితే,ఆ యాక్షన్ సన్నివేశాలు ఏ స్థాయిలో ఉంటాయో ఊహించుకోవచ్చు.ఈ ఇద్దరు గ్లోబల్ స్టార్స్ మధ్య జరిగే క్లాష్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
భారత్‌కు రాక:మరింత బలం చేకూర్చిన సోషల్ మీడియా పోస్ట్‌లు:
డాన్ లీ ఈ చిత్రంలో నటిస్తున్నారనే వార్తలకు బలం చేకూర్చేలా,ఆయన ఇటీవల సోషల్ మీడియాలో భారత్‌కు ప్రయాణమైనట్లు కొన్ని పోస్ట్‌లు పెట్టారు.దీంతో,ఆయన స్పిరిట్ కోసమే ఇండియాకు వచ్చారని కొరియన్ మీడియా గట్టిగా నమ్ముతోంది.అర్జున్ రెడ్డి, యానిమల్ వంటి సంచలన చిత్రాల దర్శకుడు సందీప్ రెడ్డి వంగా,ప్రభాస్ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు ఇప్పటికే భారీగా ఉన్నాయి.డాన్ లీ రాకతో,ఈ ప్రాజెక్ట్ ఇంటర్నేషనల్ స్థాయిలో మరింత క్రేజ్‌ను సొంతం చేసుకోవడం ఖాయం. అయితే,దీనిపై చిత్ర బృందం నుండి అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది.
