
DET:OCT30:
ప్రముఖ నటుడు సుధీర్ దల్వికి తీవ్రమైన సెప్సిస్‌తో ఆసుపత్రి పాలయ్యారు:
ప్రముఖ నటుడు సుధీర్ దల్వి 86 గారు తీవ్ర అనారోగ్యంతో ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చేరారు.అక్టోబర్ 8,2025 నుంచి చికిత్స పొందుతున్న ఆయన సెప్సిస్ అనే ప్రాణాంతక ఇన్ఫెక్షన్ కారణంగా విషమ పరిస్థితిలో ఉన్నారని సమాచారం.1977లో వచ్చిన ‘షిర్డీ కే సాయిబాబా’చిత్రంలో సాయిబాబా పాత్రతో ఆయన దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు.టెలివిజన్ రంగంలో రామాయణ్ సీరియల్లో వశిష్ఠుడిగా,క్యూకీ సాస్ భీ కభీ బహు థీ వంటి ధారావాహికల్లో కూడా నటించారు.
చికిత్స కోసం కుటుంబ సభ్యుల ఆర్థిక సహాయం అభ్యర్థన:
సుధీర్ దల్వి గారి చికిత్స కోసం ఇప్పటివరకు దాదాపు రూ.10 లక్షలు ఖర్చు అయినట్లు తెలుస్తోంది.మెరుగైన చికిత్స కోసం మరో రూ.15 లక్షలు అవసరం అవుతాయని వైద్యులు అంచనా వేస్తున్నారు.పెరుగుతున్న వైద్య ఖర్చులను భరించడం కష్టంగా మారడంతో,దల్వి గారి కుటుంబ సభ్యులు సినీ పరిశ్రమకు చెందిన వారిని,అభిమానులను ఆర్థిక సహాయం చేయాలని కోరారు.
రిద్ధిమా కపూర్ సాహ్ని అండగా నిలబడి ఆర్థిక సహాయం:
సుధీర్ దల్వి గారి కుటుంబం చేసిన విజ్ఞప్తి సోషల్ మీడియాలో వైరల్ అయిన తర్వాత,దివంగత నటుడు రిషి కపూర్ కుమార్తె, రణబీర్ కపూర్ సోదరి అయిన రిద్ధిమా కపూర్ సాహ్ని స్పందించారు.ఆమె వెంటనే దల్వి గారి చికిత్స కోసం ఆర్థిక సహాయం అందించారు.ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా పోస్ట్‌లో “Done” అని కామెంట్ చేసి,ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
ట్రోల్‌కి గట్టి సమాధానం:
రిద్ధిమా కపూర్ సాహ్ని సహాయం చేసిన విషయాన్ని ప్రకటించడంపై ఓ నెటిజన్ ఆమెను ట్రోల్ చేస్తూ,సహాయం చేశాక ఇక్కడ ఎందుకు చెప్పడం… పబ్లిసిటీ కావాలా?”అని ప్రశ్నించారు.దీనికి రిద్ధిమా గట్టిగా,హుందాగా సమాధానం ఇచ్చారు.జీవితంలో ప్రతిదీ ప్రచారం కోసం కాదు – అవసరంలో ఉన్నవారికి, మనకు చేతనైనంత సహాయం చేయడం ఒక గొప్ప వరం Everything in life is not about optics — helping someone in need and in whatever capacity you can is the biggest blessing అని ఆమె బదులిచ్చారు.
