
రెవెన్యూ శాఖపై తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. మంగళవారం జూబ్లీహిల్స్‌లోని MCRHRDలో ఉన్నతాధికారులతో సమావేశమైన సీఎం 22A నిషేధిత భూముల అంశంపై ప్రత్యేకంగా చర్చించారు.
బుధవారం అసెంబ్లీలో 22Aపై చర్చించాల్సిన అంశాలు ప్రభుత్వం తరఫున వెల్లడించాల్సిన వివరాలపై అధికారులతో సీఎం సమీక్షించారు. ఈ సందర్భంగా 22A భూముల జాబితా దాని పరిధిలోని భూములకు సంబంధించిన వివరాలను రెవెన్యూ శాఖ అధికారులు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సీఎంకు వివరించారు.
22A జాబితా రూపకల్పన ప్రస్తుతం ఉన్న భూముల వివరాలు, ఇప్పటివరకు చేపట్టిన చర్యలపై అధికారులు సీఎంకు వివరించినట్లు సమాచారం. అసెంబ్లీలో జరిగే చర్చకు అవసరమైన పూర్తి సమాచారంతో సిద్ధంగా ఉండాలని సీఎం అధికారులకు సూచించినట్లు తెలుస్తోంది.
ఈ సమీక్ష సమావేశానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, వివేక్ వెంకటస్వామి, సీఎస్ సంజయ్ జాజుతో పాటు రెవెన్యూ శాఖకు చెందిన ఉన్నతాధికారులు హాజరయ్యారు.
