
D Educt: Sept 18: సీపీగెట్ తొలి విడతలో భాగంగా ఎంఏ, ఎంకాం, ఎంఎస్‌సీ తదితర పీజీ కోర్సుల్లో మొత్తం 17,586 మంది విద్యార్థులకు సీట్లు కేటాయించారు. సెప్టెంబర్ 17న రాత్రి సీట్ల కేటాయింపు ప్రక్రియ పూర్తయింది.
కన్వీనర్ కోటాలో మొత్తం 47,237 సీట్లు అందుబాటులో ఉండగా.. వాటిలో సగం సీట్లు కూడా భర్తీ కాకపోవడం గమనార్హం. సీట్లు పొందిన వారిలో అమ్మాయిల సంఖ్య అధికంగా ఉంది. మొత్తం 17,586 మందిలో 13,125 మంది అమ్మాయిలు ఉండగా.. అబ్బాయిలు 4,461 మంది మాత్రమే ఉన్నారు.
సామాజిక వర్గాల వారీగా చూస్తే.. సీట్లు పొందిన వారిలో ఓసీ కేటగిరీకి చెందిన వారు 1,375 మంది, బీసీలు 9,491 మంది, ఎస్సీలు 4,375 మంది, ఎస్టీలు 2,345 మంది ఉన్నట్లు కన్వీనర్ తెలిపారు.
సీట్లు పొందిన అభ్యర్థులు సెప్టెంబర్ 21లోపు నిర్ణీత ఫీజు చెల్లించి సెల్ఫ్ రిపోర్టింగ్ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. గడువులోగా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయని అభ్యర్థుల సీట్లపై తదుపరి దశలో నిబంధనల ప్రకారం చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది.
