D News: Aug 4: హైదరాబాద్‌లోని నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) వైద్య రంగంలో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. మూడేళ్లలోపే 1000 రోబోటిక్ శస్త్రచికిత్సలను విజయవంతంగా పూర్తి చేసి దేశంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కొత్త బెంచ్‌మార్క్‌ను నెలకొల్పింది. ఈ విషయాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రకటిస్తూ, అత్యాధునిక రోబోటిక్ వైద్య సేవలను సామాన్య ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చిన సంస్థగా నిమ్స్ నిలిచిందని పేర్కొంది.

ఈ ఘనత సాధించిన సందర్భంగా నిమ్స్ డైరెక్టర్, యూరాలజీ అండ్ రీనల్ ట్రాన్స్‌ప్లాంటేషన్ విభాగం సీనియర్ ప్రొఫెసర్ డాక్టర్ రాహుల్ దేవరాజ్‌తో పాటు యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ, సర్జికల్ ఆంకాలజీ, అనస్థీషియాలజీ, నర్సింగ్, ఆపరేషన్ థియేటర్ సిబ్బందిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. అలాగే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ కూడా నిమ్స్ బృందం కృషిని ప్రశంసించారు.

మొత్తం 1000 రోబోటిక్ శస్త్రచికిత్సల్లో యూరాలజీ విభాగం 590, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ 248, సర్జికల్ ఆంకాలజీ 162 శస్త్రచికిత్సలను నిర్వహించింది. వీటిలో 90 శాతానికి పైగా ఆపరేషన్లు ఆరోగ్యశ్రీ, ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్) పథకాల కింద రోగులకు పూర్తిగా ఉచితంగా నిర్వహించడం విశేషం.

రాడికల్ ప్రోస్టేటెక్టమీ, రాడికల్ సిస్టెక్టమీ, క్లిష్టమైన రోబోటిక్ రీనల్ ట్రాన్స్‌ప్లాంటేషన్ వంటి అత్యంత సంక్లిష్ట శస్త్రచికిత్సలను కూడా నిమ్స్ వైద్య బృందం విజయవంతంగా నిర్వహించింది. ఆధునిక రోబోటిక్ సాంకేతికతతో శస్త్రచికిత్సల్లో కచ్చితత్వం పెరగడంతో పాటు రక్తస్రావం, నొప్పి తగ్గి రోగులు త్వరగా కోలుకునే అవకాశం ఉంటుందని వైద్యులు తెలిపారు.

సామాన్య ప్రజలకు ప్రపంచస్థాయి వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్య సేవలను మరింత విస్తరించేందుకు నిమ్స్ సాధించిన ఈ విజయం కీలక మైలురాయిగా నిలుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana
వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana