
DNews:06 NOV:జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతను భారీ మెజారిటీతో గెలిపించాలని ఆస్ట్రేలియా బీఆర్ఎస్ బృందం పిలుపునిచ్చింది. సిడ్నీ నుండి ఓటర్లను ఉద్దేశించి వారు ఈ పిలుపునిచ్చారు.బీఆర్ఎస్ ఆస్ట్రేలియా వైస్ ప్రెసిడెంట్ రాజేష్ గిరి రాపోలు మాట్లాడుతూ – ఓటర్లు విజ్ఞతతో ఆలోచించి ప్రజల పక్షాన నిలిచే బీఆర్ఎస్ అభ్యర్థికి ఓటు వేయాలని కోరారు.
రవీందర్ చింతామణి మాట్లాడుతూ – “కాంగ్రెస్ ప్రభుత్వం గత రెండు సంవత్సరాల్లో రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలను మోసం చేసింది, రాష్ట్రాన్ని విధ్వంస దిశగా నడిపింది” అన్నారు.రవిశంకర్ దూపాటి మాట్లాడుతూ – “కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. రెండేళ్ల పాలనలో ప్రజలు ఎదుర్కొన్న నష్టాలు అందరికీ కనిపిస్తున్నాయి” అని పేర్కొన్నారు.
బీఆర్ఎస్ ఆస్ట్రేలియా శాఖ అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి మాట్లాడుతూ – “జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బుల్డోజర్ (కాంగ్రెస్)కు కారు (బీఆర్ఎస్)కు మధ్య పోటీగా మారింది. కారు గుర్తుకు ఓటేసి సునీతను గెలిపించి కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలి” అని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సభ్యులు పరశురామ్ ముతుకుల్ల, రాహుల్ రాంపల్లి, సుతారి మాధుకర్, సుమన్ బి, శ్రీనివాస్ సుతారి, రాజేష్ ఎం, రాజ్‌కుమార్ నర్మేటి తదితరులు పాల్గొన్నారు.
