
DNews:06 NOV:హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ మళ్లీ యాక్షన్‌లోకి దిగారు. ‘ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్’గా పేరు గాంచిన ఆయన ఈసారి షూటింగ్ రేంజ్‌లో పిస్టల్‌తో ప్రాక్టీస్ చేశారు.
బుధవారం ఉదయం సజ్జనార్ హైదరాబాద్ శివార్లలోని తెలంగాణ పోలీస్ అకాడమీకి చేరుకుని, సిటీ పోలీస్ బృందంతో కలిసి షూటింగ్ ప్రాక్టీస్‌లో పాల్గొన్నారు. బుల్స్ ఐను గురి తప్పకుండా కొట్టడం థ్రిల్లింగ్ అనుభూతి అని ఆయన సోషల్ మీడియా ద్వారా పేర్కొన్నారు.
ఆయన షూటింగ్ చేస్తూ ఉన్న ఫోటోలను తన ఎక్స్ (Twitter) ఖాతాలో స్వయంగా పంచుకున్నారు.
సజ్జనార్ ఈ ఏడాది అక్టోబర్ 30న హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు దాదాపు నాలుగేళ్లు టీఎస్ఆర్టీసీ ఎండీగా పనిచేశారు. ఆర్టీసీ బాధ్యతలకు ముందు ఆయన సైబరాబాద్ సీపీగా విధులు నిర్వర్తించిన విషయం తెలిసిందే.
