DNews:04 Dec:కూకట్‌పల్లిలోని ఒక జూనియర్ కాలేజీ హాస్టల్‌లో సెల్‌ఫోన్ తీసుకొచ్చినందుకు గాను ప్రిన్సిపాల్ ఒక విద్యార్థిని కర్రతో తీవ్రంగా కొట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.కేపీహెచ్‌బీ సాయినగర్‌లోని శ్రీవశిష్ట జూనియర్ కాలేజీ.కె. తిరుపతి కొడుకు, నిజామాబాద్‌కు చెందిన ఇంటర్ ఫస్టియర్ విద్యార్థి. ఇతను కాలేజీ హాస్టల్‌లోనే ఉంటున్నాడు.నవంబర్ 30న కాలేజీ ప్రిన్సిపాల్ హాస్టల్‌లో తనిఖీలు చేస్తుండగా, సదరు విద్యార్థి వద్ద మొబైల్ ఫోన్ దొరికింది.మొబైల్ ఫోన్ దొరికినందుకు ప్రిన్సిపాల్ ఆ విద్యార్థిని కర్రతో చితకబాదాడు. ఈ దాడి కారణంగా విద్యార్థి వీపుపై తీవ్రంగా వాతలు పడ్డాయి.

బాధితుడైన విద్యార్థి ఈ విషయాన్ని తన కుటుంబ సభ్యులకు తెలియజేశాడు. దాంతో వారు బుధవారం (సమచారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన రోజు) కాలేజీ వద్దకు వచ్చి యాజమాన్యంతో గొడవకు దిగారు. అనంతరం, విద్యార్థి కుటుంబ సభ్యులు కేపీహెచ్‌బీ పోలీసుస్టేషన్‌లో ప్రిన్సిపాల్‌పై ఫిర్యాదు చేశారు.సెల్‌ఫోన్ నిషేధం ఉన్నప్పటికీ, విద్యార్థిని అమానుషంగా కొట్టడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై పోలీసులు దర్యాప్తు చేపట్టే అవకాశం ఉంది.

By rajesh

పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana పుదీనాతో చేసే ఆరోగ్యకర వంటలు | Healthy recipes made with mint-DTv Telangana బ్రెడ్ తో టేస్ట్ అదిరే రెసిపీస్ | Tasty recipes with bread-DTv Telangana శక్తిని పెంచే హోమ్మేడ్ డ్రింక్స్ | Homemade energy-boosting drinks-DTv Telangana