
DNews: Dec 03: దమేరా మండలంలో మూడవ దశ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ సందర్భంగా జిల్లా కలెక్టర్ స్నేహా సబరిష్ సిబ్బందికి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. బుధవారం నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైన నేపథ్యంలో ఆమె దమేరా మండల కేంద్రం మరియు ఒగ్లాస్పూర్ క్లస్టర్‌ను ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసే సమయంలో సరైన పత్రాలను జతచేయాలని, ఎలాంటి లోపాలు లేకుండా చూడాలని సూచించారు. అలాగే అధికారులు నామినేషన్ కేంద్రంలో ఓటర్ల జాబితాను అందుబాటులో ఉంచి, ఎలాంటి లోపాలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ పరిశీలనలో ఆమెతో పాటు ఆర్డీవో డాక్టర్ కె. నారాయణ, తహసీల్దార్ జ్యోతి వరలక్ష్మి దేవి, ఎంపీడీవో కల్పనా, ఎంసీపీఓ రంగాచారి మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.
