
DNews:10 Dec: సిగాచీ ఫార్మా ప్రమాదానికి సంబంధించి దాఖలైన పిల్‌పై విచారణ సందర్భంగా తెలంగాణ హైకోర్టు అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రిటైర్డ్ సైంటిస్ట్ కలపల బాబూరావు దాఖలు చేసిన పిల్‌లో, ఘటనపై ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఏర్పాటు చేయాలని కోరుతూ చేసిన వినతిపై కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.రెడ్ జోన్ పరిశ్రమలలో తనిఖీలు ఎందుకు జరగడంలేదని హైకోర్టు అధికారులు ప్రశ్నించింది.రెడ్ కేటగిరీ పరిశ్రమలైతే 12 శాఖలు నిర్దిష్ట వ్యవధిలో తనిఖీలు చేయాలి — అవి జరిగాయా అని కోర్టు అడిగింది.కార్మిక శాఖ, ప్రావిడెంట్ ఫండ్ శాఖ పాత్ర ఏంటి? ప్రశ్నలకు అడ్వకేట్ జనరల్, అధికారులు సమాధానాలు ఇవ్వలేకపోయారు.అధికారులు సంసిద్ధంగా లేనట్టుగా కనిపిస్తోందని, ఒత్తిళ్లు ఉన్నాయా? అని కోర్టు ప్రశ్నించింది.
అధికారులు సరైన సమాధానాలు ఇవ్వకపోతే:ఉన్నతాధికారులతో దర్యాప్తు ఆదేశిస్తాం లేదంటే కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు ఉంటుంది అని హెచ్చరించింది.ప్రైవేట్ పరిశ్రమల యాజమాన్యాల ప్రభావం పెరిగిపోతుండటం, కాంట్రాక్టు కార్మికుల గొంతు వినబడకపోవడంపై కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది.నిర్లక్ష్యం వహించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటేనే ఇతరులకు గుణపాఠం అవుతుంది అని వ్యాఖ్యానించింది.హైకోర్టు ఈ కేసు తదుపరి విచారణను డిసెంబర్ 30కి వాయిదా వేసింది.
