
DNews:06 Dec: దేశంలో అతిపెద్ద ఎయిర్‌లైన్ సంస్థ అయిన ఇండిగో ఈరోజు కూడా భారీ సంఖ్యలో విమానాలను రద్దు చేస్తుండడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శనివారం సుమారు 400కి పైగా విమానాలు రద్దు చేయబడ్డాయి. ఇది వరుసగా ఐదో రోజు.దేశంలోని ప్రధాన ఎయిర్‌పోర్ట్‌లు ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌లలో వేలాది మంది ప్రయాణికులు గంటల తరబడి ఫ్లైట్ల కోసం వేచి ఉన్నారు. ఇండిగో ఉద్యోగుల నిర్లక్ష్యానికి నిరసనగా కొన్ని చోట్ల ఆందోళనలు కూడా జరిగాయి. ప్రత్యేకంగా హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో ఒక నైజీరియన్ మహిళ ఇండిగో సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసి హల్‌చల్ చేసింది.
ఇండిగో విమానాల రద్దులకు కారణం, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ఇచ్చిన పైలెట్ డ్యూటీ నిబంధనలలో మార్పులు. కానీ, ఇండిగో ఈ మార్పులకు అనుగుణంగా తగిన ప్లానింగ్ చేయకపోవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది.గత కొన్ని రోజుల్లో మంగళవారం 100కి పైగా, బుధవారం 200కి పైగా, గురువారం 500కి పైగా, శుక్రవారం వెయ్యికి పైగా విమానాలు రద్దు చేయబడాయి. దీంతో ప్రయాణికుల అసంతృప్తి మరింత పెరిగింది.ప్రయాణికులు తమ ప్రయాణాల్లో సజాగ్రతగా ఉండాలని, ఎయిర్‌లైన్స్, అధికారులు త్వరిత చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
