DNews06 NOV:హైదరాబాద్‌,జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు కాంగ్రెస్ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావుపై కఠిన వ్యాఖ్యలు చేశారు.తుమ్మల నాగేశ్వర్‌రావు ఓడిపోయి పామాయిల్ తోటలో ఉన్న సమయంలోనే కేసీఆర్ ఆయనకు మంత్రివర్గంలో అవకాశం కల్పించారని తాతా మధు గుర్తుచేశారు. మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, మాజీ ఎంపీ నామా నాగేశ్వర్‌రావుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.

తాతా మధు మాట్లాడుతూ, “జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ గెలవలేనని కార్యకర్తల నుండి సీఎం వరకు అందరికీ అర్థమైందని” అన్నారు.“ఏం చేయాలో పాలుపోక మతం, కులం విషయంలో కింది స్థాయికి దిగిపోయి రాజకీయాలు చేస్తున్నారు. మనిషికి ఓ కులం సంబంధం లేదు, కానీ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు మాత్రం కులపోరాటాలకు తెరలేపారు” అని విమర్శించారు.

“మాగంటి సునీత కన్నీళ్లు పెట్టుకుంటే కూడా మంత్రి తుమ్మల చిల్లరగా మాట్లాడారు. ఆమెపై దుర్మార్గమైన ప్రచారం ప్రారంభించారు.మాగంటి సునీతకు ప్రజల ఆశీస్సులు ఉన్నాయి, జూబ్లీహిల్స్‌లో ఆమె గెలుపు ఖాయం” అని తాతా మధు ధీమా వ్యక్తం చేశారు.

ఎన్టీఆర్ విగ్రహాల ఆవిష్కరణను అడ్డుకున్న నేతలను గుర్తు చేస్తూ తాతా మధు అన్నారు:“ఎన్టీఆర్ విగ్రహాలను ఆవిష్కరణ చేయవద్దని చెప్పిన వారిని పక్కన పెట్టి మైత్రీవనంలో ప్రతిష్టించబోతున్నాం.కమ్మ సామాజిక వర్గానికి ఖానామెట్‌లో ఐదు ఎకరాల భూమి ఇచ్చిన కేసీఆర్‌ — ఎన్టీఆర్‌పై అత్యంత అభిమానం ఉన్న నాయకుడు. ఆయన తన కుమారుడికి కూడా ఎన్టీఆర్ పేరు పెట్టారు” అని గుర్తుచేశారు.తాతా మధు చివరగా పేర్కొంటూ, “ఎన్టీఆర్‌తో ప్రారంభమైన సామాజిక విప్లవం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత సంపూర్ణమైంది. దమ్ముంటే తుమ్మల నాగేశ్వర్‌రావు తమ హామీలు, అభివృద్ధి వివరాలు చెప్పాలి” అన్నారు.

By rajesh

పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana పుదీనాతో చేసే ఆరోగ్యకర వంటలు | Healthy recipes made with mint-DTv Telangana బ్రెడ్ తో టేస్ట్ అదిరే రెసిపీస్ | Tasty recipes with bread-DTv Telangana శక్తిని పెంచే హోమ్మేడ్ డ్రింక్స్ | Homemade energy-boosting drinks-DTv Telangana