
DNews:24 Nov:పెద్దపల్లి రూరల్ చాలా కాలంగా ఎదురు చూస్తున్న పంచాయతీ సర్పంచ్ ఎన్నికల ప్రక్రియకు వేగం వచ్చేసింది. సర్పంచ్‌లు లేని పరిస్థితుల్లో కార్యదర్శులు ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు ముగింపు పలికే దిశగా యంత్రాంగం కదిలింది. కోర్టు మార్గదర్శకాల మేరకు పాత పద్ధతినే అనుసరిస్తూ సర్పంచ్ స్థానాల రిజర్వేషన్లను అధికారులు ఖరారు చేశారు.గత వారం రోజులుగా జరిగిన కసరత్తు అనంతరం పెద్దపల్లి మండలంలోని రిజర్వేషన్లు ఈ విధంగా నిర్ణయించబడ్డాయి:
- జనరల్ – 8 స్థానాలు
- జనరల్ మహిళ – 7 స్థానాలు
- ఎస్సీ జనరల్ – 3 స్థానాలు
- ఎస్సీ మహిళ – 3 స్థానాలు
- బీసీ జనరల్ – 5 స్థానాలు
- బీసీ మహిళ – 4 స్థానాలు
మొత్తం 30 గ్రామ పంచాయతీలకు ఈ రిజర్వేషన్లు వర్తించనున్నాయి.ఇక ఎన్నికలు నిజంగా జరగనున్నాయా? ఎప్పుడు జరగనున్నాయి? అనే అంశం మాత్రం ప్రజలు, రాజకీయ నాయకుల్లో ఉత్కంఠను పెంచుతోంది. అయినప్పటికీ రిజర్వేషన్లు ఖరారు కావడంతో ఎన్నికల ప్రక్రియ దగ్గరపడిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
