
DNews: Nov 24: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. వనపర్తి నియోజకవర్గంలో ఆయన చేసిన అవినీతి కారణంగా బీఆర్‌ఎస్‌కు అపార నష్టం జరిగిందని ఆమె ఆరోపించారు. మూడు నాలుగు ఫార్మ్‌హౌస్‌లు నిర్మించి, అణచివేయలేని అవినీతి చేశారని కవిత తీవ్రంగా దుయ్యబట్టారు. ప్రజలు అసహాయంగా ఉన్నారని, ఎంఆర్ఓ కార్యాలయం కాలిపోయినా ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడిందని ఆమె అన్నారు. నిరసన తెలిపిన 32 మందిపై పోలీసులు కేసులు నమోదు చేసి జైలుకు పంపారని కూడా ఆమె విమర్శించారు. ఇలాంటి అవినీతిపరుడిని ఓడించడం సరైన నిర్ణయమని కవిత స్పష్టం చేశారు. వనపర్తి నియోజకవర్గంలో రాజసంవిధానం తీసుకొచ్చిన నిరంజన్ రెడ్డిని ఆమె తీవ్రంగా విమర్శించారు. ఒక్క ఎకరానికి కూడా నీరు అందించకుండా, తాను నీటి ప్రియుడు నిరంజన్ అని చెప్పుకోవడం హాస్యాస్పదమని ఆమె వ్యాఖ్యానించారు. ఇకపై తన గురించి ఎక్కడైనా మాట్లాడితే జాగ్రత్తగా ఉండాలని, లేకపోతే జుట్టు పీకి పడేస్తానని కవిత నిరంజన్ రెడ్డికి ఘాటైన హెచ్చరిక ఇచ్చారు.
