
DNews:22 Nov:పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం గుంపుల గ్రామంలో మానేరు వాగుపై నిర్మించిన చెక్ డ్యామ్‌ను శుక్రవారం రాత్రి గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. దీతో భారీగా నీరుదిగువప్రాంతాలకు చేరి విస్తారంగా బయటకు వెళ్లిపోతున్నట్లు అధికారులు తెలిపారు.తాజాగా సుమారు ₹23 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ చెక్‌డ్యామ్‌ను నాశనం చేయడం స్థానికంగా ఆందోళనకు గురిచేసింది. ఘటన సమాచారం అందుకున్న వెంటనే నీటిపారుదల శాఖ అధికారులు అక్కడికి వెళ్లి పరిశీలనలు నిర్వహించారు.అక్రమ ఇసుక రవాణా కోసమే చెక్‌డ్యామ్‌ను కూల్చివేసి ఉండొచ్చనే అనుమానం వ్యక్తమవుతోంది. వాగులో ఇసుక దోపిడీ కొనసాగుతోందని ఇప్పటికే స్థానికులు పలుమార్లు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.పోలీసులు కేసు నమోదు చేసి, దుండగుల గుర్తింపు కోసం విచారణ చేపట్టారు. అధికారులు చెక్‌డ్యామ్‌ను పునరుద్ధరించే చర్యలు చేపడుతున్నారు.
