
DNews:11 Dec: రాష్ట్రంలో పంచాయితీ ఎన్నికల తొలి విడత పోలింగ్ ఉదయం ప్రారంభమైంది. ఉదయం 9 గంటల వరకు మొత్తం 19.58 శాతం పోలింగ్ నమోదైంది. గ్రామాల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు నగరంలో ఉన్న పల్లె ప్రజలు తమ సొంత ఊర్లకు భారీగా ప్రయాణం చేయడంతో హైదరాబాద్ సరిహద్దుల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.ప్రత్యేకంగా ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాలకు ప్రయాణించే ప్రజలు ఎక్కువ సంఖ్యలో బయలుదేరడంతో చౌటుప్పల్ హైవేపై వాహనాల రద్దీ తీవ్రమైంది. కార్లు, బైకులు, RTC బస్సులు, ప్రైవేట్ వాహనాలతో రహదారులు నిండిపోయాయి.
RTC బస్సులు, ప్రైవేటు వాహనాలు కిక్కిరిసిపోయే స్థాయిలో ప్రజలు ప్రయాణిస్తున్నారు. ఎల్బీనగర్ ప్రాంతం, వనస్థలిపురం, భాగ్యలత వరకు భారీగా ట్రాఫిక్ నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది. హయత్‌నగర్ నుండి వనస్థలిపురం వరకు ట్రాఫిక్ పూర్తిగా నెమ్మదించింది.ఇక హైదరాబాద్‌కు దూరంగా ఉన్న ఇతర జిల్లాలకు చెందిన ప్రజలు ఇప్పటికే బస్సులు, రైళ్లు, ప్రైవేట్ వాహనాల్లో తమ గ్రామాలకు ప్రయాణం మొదలుపెట్టారు. పల్లె బాట పట్టిన జనంతో నగరాంత్య రహదారులు ఒకింత ఒత్తిడికి గురయ్యాయి.
