
DNews:09 Dec:తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 రెండో రోజు విశేషాలతో కొనసాగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, దేశ–విదేశాల నుంచి వచ్చిన ప్రముఖ ప్రతినిధులు సమ్మిట్లో పాల్గొన్నారు.ఇవాళ 20కి పైగా సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు.ప్రముఖ పరిశ్రమల అధినేత ఆనంద్ మహీంద్రాతో EV, రూరల్ ఎంటర్ప్రైజెస్ రంగాలపై ముఖ్య చర్చలు జరగనున్నాయి.సాయంత్రం 6 గంటలకు “తెలంగాణ విజన్ డాక్యుమెంట్”ను ఆవిష్కరించనున్నారు.రాత్రి 7 గంటలకు అద్భుతమైన డ్రోన్ షోతో గ్లోబల్ సమ్మిట్ ముగింపు కార్యక్రమం జరుగనుంది.
తెలంగాణలో పెట్టుబడుల ఒప్పందాలు రూ.5 లక్షల కోట్ల మార్కుకు చేరువయ్యాయి.ఈరోజు మాత్రమే రూ.1 లక్ష కోట్లకు పైగా ఒప్పందాలు జరిగాయి.నిన్న ఒక్కరోజే రూ.3,97,500 కోట్ల పెట్టుబడులకు ప్రముఖ కంపెనీలు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకున్నాయి.ప్రపంచస్థాయి వన్యప్రాణి సంరక్షణ కేంద్రం, నైట్ సఫారీ ఏర్పాటుకు ‘వంతార గ్రూప్’ ముందుకు వచ్చింది.పెట్టుబడుల పరంగా, వ్యూహాత్మక సమావేశాల పరంగా, సమగ్ర అభివృద్ధి లక్ష్యాలతో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 రాష్ట్ర ప్రగతికి కీలక వేదికగా నిలుస్తోంది.
