
DNews:09 Dec:హైదరాబాద్ తుది దశ తెలంగాణ ఉద్యమం ఫలితంగా రాష్ట్ర ఏర్పాటుకు తొలి దశ ప్రారంభమైన రోజు డిసెంబర్ 9ను ‘విజయ్ దివస్’గా గుర్తించాల్సిన రోజు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు.కేటీఆర్ పేర్కొన్న ముఖ్యాంశాలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు దారితీసిన నిర్ణయాత్మక ప్రక్రియ ప్రారంభమైన రోజే డిసెంబర్ 9, దీనికి నేటితో 16 సంవత్సరాలు పూర్తయ్యాయి.సబ్బండ వర్గాల పోరాటం, అమరుల త్యాగం, అలాగే కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష కారణంగానే ఢిల్లీ పీఠం స్పందించిందని తెలిపారు.కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించిన రోజు కావడంతో డిసెంబర్ 9 చారిత్రాత్మకమని చెప్పారు.“నవంబర్ 29 (Deeksha Diwas) లేకపోతే డిసెంబర్ 9 (Vijay Diwas) లేదు… డిసెంబర్ 9 లేకుంటే జూన్ 2 లేదు” అని కేటీఆర్ స్పష్టం చేశారు.ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమ చరిత్రలో ప్రజల పోరాటం, నేతల త్యాగాలను కేటీఆర్ స్మరించారు.
