D Spiritual: Dec 3: మన ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఉండే గడపను గౌరవంగా చూడాలి. హిందూ సంప్రదాయం ప్రకారం గడపను లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు. అందుకే గడపను కాలితో తొక్కడం, తన్నడం, లేదా దానిపై కూర్చోవడం పూర్తిగా నిషిద్ధంగా చెప్పబడింది. ఇలాంటి చర్యలు ఇంట్లో శుభశక్తులను దూరం చేస్తాయని, లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గుతుందని నమ్మకం.

ఇంటి నిర్మాణం సమయంలో ప్రధాన ద్వారం ఎదురుగా కొన్ని వస్తువులు ఉండకూడదని వాస్తు నిపుణులు హెచ్చరిస్తారు. ముఖ్యంగా ఇంటి గుమ్మానికి ఎదురు నిలువు స్తంభం ఉండటం మంచిది కాదు. ఇది వాస్తు దోషానికి దారి తీస్తుందని, ముఖ్యంగా ఇంట్లోని స్త్రీలకు అనారోగ్య సమస్యలు పెరిగే అవకాశం ఉందని చెబుతారు. ఈ కారణంగా ద్వారం ముందున్న అడ్డంకులను తొలగించడం అవసరం.

ఇంటి ప్రధాన ద్వారం ముందు మెట్లు ఉండటం కూడా అనుకూలం కాదట. వాస్తు ప్రకారం ఇలా ఉంటే ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు, డబ్బు నిలవకపోవడం, అప్పులు పెరగడం వంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని నమ్మకం. అదే విధంగా ఇంటి ప్రధాన ద్వారం ఎదురుగా చెట్టు ఉండకూడదు. ఇది ఇంట్లోని వ్యక్తులకు ఆటంకాలు, ప్రతిబంధకాలు, నిరంతర సమస్యలను తీసుకువస్తుందని అంటారు.

మరియు చాలామంది అలవాటుగా గుమ్మం వద్ద కూర్చొని మాట్లాడటం, అక్కడే గోర్లు కత్తిరించడం, తల దువ్వడం వంటి పనులు చేస్తుంటారు. ఇవన్నీ వాస్తు ప్రకారం అపశకునాలు. గుమ్మం వద్ద ఇలాంటి అస్వచ్ఛ పనులు చేయడం లక్ష్మీదేవి ఆగ్రహానికి కారణమవుతుందని చెబుతారు. అందుకే గుమ్మం ఎల్లప్పుడూ శుభ్రంగా, పవిత్రంగా ఉండాలి.

శుక్రవారం రోజున గుమ్మానికి పసుపు రాసి, కుంకుమ బొట్లు పెట్టి పూజ చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం ఇంటిపై ఉంటుంది అని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. అయితే గుమ్మాన్ని ఎప్పుడూ కాలితో తొక్కకూడదు. గడపపై అడుగు పెట్టడం లక్ష్మీదేవికి అవమానం చేసినట్లు భావిస్తారు, దీని వల్ల ఆమె కటాక్షం దూరం అవుతుందని నమ్మకం.

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana
వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana