
DNews:10 Dec: ఖిలావరంగల్, వరంగల్ రైల్వే స్టేషన్లో బుధవారం ఉదయం భయానక ఘటన చోటుచేసుకుంది. కోణార్క్ ఎక్స్‌ప్రెస్ ఎక్కబోతుండగా ప్రమాదవశాత్తూ జారిపడిన ఓ వ్యక్తి రైలు చక్రాల కింద పడి అక్కడికక్కడే మృతిచెందాడు.వరంగల్ జీఅర్పీ హెడ్ కానిస్టేబుల్ ఎస్. రవీందర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం, ఖమ్మం వైపు వెళ్తున్న కోణార్క్ ఎక్స్‌ప్రెస్ ఎక్కేందుకు 50 ఏళ్ల వ్యక్తి ప్రయత్నించాడు. అయితే రైలు కదులుతున్న సమయంలో ఎక్కేందుకు ప్రయత్నించడంతో అతని కాలు జారి ట్రాక్‌పై పడిపోయాడు. వెంటనే ముందుకు సాగిన రైలు చక్రాలు అతని శరీరంపై నుంచి వెళ్లడంతో నడుము వద్ద రెండు ముక్కలై అక్కడికక్కడే మరణించాడు.
మృతుడు తెల్లటి, లేత నీలం రంగులపై బ్రౌన్ లైన్స్ గల ఫుల్ షర్ట్, లేత ఆకుపచ్చ (పెసర) రంగు ప్యాంటు ధరించి ఉన్నాడు. అతని వద్ద మంగళవారం ఖమ్మం నుంచి వరంగల్‌కు వచ్చిన రైల్వే టికెట్ తప్ప ఎలాంటి ఐడెంటిటీ కార్డులు లభ్యం కాలేదు.ఈ ఘటనపై రైల్వే అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని ఎంజీఎం దవాఖాన మార్టూరీలో భద్రపరిచారు. మృతుడి వివరాలు తెలిసినవారు వరంగల్ జీఆర్పీ స్టేషన్‌ను లేదా క్రింది మొబైల్ నంబర్లను సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు.
