
DNews:10 Dec: సూర్యాపేట, సర్పంచ్ ఎన్నికల వేళ సూర్యాపేట జిల్లాలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. నూతనకల్ మండలం లింగంపల్లిలో సర్పంచ్ ఎన్నికల్లో ఓటమి భయంతో కాంగ్రెస్ కార్యకర్తలు రెచ్చిపోయారు. గ్రామంలో బీఆర్ఎస్ కార్యకర్తలపై సుమారు 70 మంది కాంగ్రెస్ కార్యకర్తలు కర్రలు, రాళ్లతో దాడి చేసినట్లు సమాచారం.
ఈ ఘర్షణలో బీఆర్ఎస్ కార్యకర్త ఉప్పుల మల్లయ్య అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. మరో 15 మంది తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. ఘటనతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో అక్కడ భారీగా పోలీసులను మోహరించారు.
కాంగ్రెస్ కార్యకర్తల దాడిని బీఆర్ఎస్ నాయకులు తీవ్రంగా ఖండించారు. గ్రామంలో ఉద్రిక్తత నెలకొంటోందని ముందుగానే సమాచారం ఇచ్చినా పోలీసులు నిర్లక్ష్యం వహించారని వారు ఆరోపించారు. ఎన్నికల అధికారులు, పోలీసులు తమ బాధ్యతలను నిర్వర్తించకపోవడం వల్లే ప్రాణనష్టం జరిగిందని పేర్కొన్నారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు స్పందించి దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
