
DET:SEP16:
మిరాయ్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్: తెజ సజ్జా కెరీర్‌లోనే అతిపెద్ద ఓపెనింగ్ రికార్డు:
తెలుగు సినీ ఇండస్ట్రీలో తాజాగా విడుదలైన మిరాయ్ సినిమా,ప్రేక్షకుల నుండి విపరీతమైన స్పందనను సొంతం చేసుకుంది.హీరో తెజ సజ్జా ఇప్పటి వరకు చేసిన చిత్రాల్లో ఇది అత్యంత పెద్ద ఓపెనింగ్ సాధించిన చిత్రంగా నిలిచింది. ముఖ్యంగా మూడవ రోజుకు చేరుకున్న కలెక్షన్స్,ఆయన కెరీర్ గ్రాఫ్‌నే కాదు,పరిశ్రమలో కూడా చర్చనీయాంశమయ్యాయి.
మూడవ రోజు వరకూ ఈ చిత్రం రూ.16.50 కోట్లు వసూలు చేసి,మొత్తం మూడు రోజుల్లో రూ.44.50 కోట్ల కలెక్షన్లు రాబట్టింది.ఇది తెజ సజ్జా కెరీర్‌లోనే అత్యంత పెద్ద ఓపెనింగ్‌గా నిలిచింది.మంచి టాక్‌తో థియేటర్లలో హౌస్‌ఫుల్ షోలు కొనసాగుతుండటంతో,రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ రికార్డులు సృష్టించే అవకాశం ఉంది.
ఈ చిత్రానికి వచ్చిన మొదటి రోజు పాజిటివ్ టాక్‌తోనే థియేటర్లలో హౌస్‌ఫుల్ షోలు కొనసాగాయి.ఫ్యామిలీ ఆడియన్స్‌తో పాటు యువతలో కూడా మంచి క్రేజ్‌ను సృష్టించడం వల్ల కలెక్షన్లు మరింత పెరిగాయి.విడుదలైన మూడవ రోజు నాటికి దేశవ్యాప్తంగా గణనీయమైన మొత్తాన్ని రాబట్టి,తెజ సజ్జా తన కెరీర్‌లోనే అతి పెద్ద హిట్ దిశగా అడుగులు వేస్తున్నాడు.
మిరాయ్ కథలో ఉన్న కొత్తదనం,తెజ సజ్జా యాక్షన్-ఎమోషనల్ పర్ఫార్మెన్స్,అలాగే సాంకేతికంగా ఉన్న నాణ్యత ఈ విజయానికి కారణమని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.ఇప్పటికే ఓవర్సీస్ మార్కెట్‌లో కూడా ఈ సినిమా బాగానే ఆడుతూ, తెలుగు సినిమాల గ్లోబల్ రేంజ్‌ను మరోసారి చూపిస్తోంది.
థియేటర్లలో ఇదే ఉత్సాహం కొనసాగితే,ఈ సినిమా రాబోయే రోజుల్లో రికార్డులను తిరగరాయడం ఖాయం.
