ఈ సినిమాలో అర్జున్ చక్రవర్తి విజయ్ రామరాజుని ఒక అనాథగా చూపించారు,అతడిలో ప్రతిభను గమనించిన కోచ్ దయానంద్ రెడ్డి హీరోని కబడ్డీ ఆటలో మంచి ప్లేయర్ గా తీర్చిదిద్దుతాడు.అర్జున్ తన గ్రామానికి చెందిన ఒక పెద్దింటి అమ్మాయి సిజా రోజ్ తో ప్రేమలో పడతాడు.అసలు విజయ్ ఆ అమ్మాయిని పెళ్లి చేసుకంటాడా ?విజయ్ డిప్రెషన్ కి కారణం ఏంటి ? కబడ్డీ ని విజయ్ వదిలెయ్యడానికి కారణం ఏంటి ? విజయ్ కబడ్డీ ని వదిలేసి వేరే కెరీర్ ని ఎంచుకుంటాడా లేదా మానదు మార్చుకుని అంతర్జాతీయ పోటీలలో గెలుస్తాడా ? అనే అంశాలతో సినిమా చిత్రీకరించారు.

ఈ సినిమా ఫోకస్ స్పోర్ట్స్ నేపథ్యంలో తీశారు,డైరెక్టర్ విక్రాంత్ రుద్ర చాలా నీట్ స్క్రిప్ట్ తో మూవీని ప్రేక్షకుల దగ్గరికి తీసుకొచ్చారు,విగ్నేష్ భాస్కరన్ అందించిన మ్యూజిక్ ప్రజల్లోకి అంత చేరలేకపోయిన,బాక్గ్రౌండ్ మ్యూజిక్ తో కొంతవరకు సఫలం అయ్యారని చెప్పుకోవచ్చు,సినిమాటోగ్రఫీ చాలా బాగుంది.కోచ్ గా నటించిన అజయ్ తన అచ్తింగ్ ని నిరూపించుకున్నారని చెప్పుకోవచ్చు,హీరో యాక్టింగ్ అందరి ప్రశంసలు అందుకోవడం గమనార్హం.అర్జున్ చక్రవర్తి లౌ బడ్జెట్ మూవీ అయినా ప్రేక్షకుల మనసుకి చాలా దగ్గర అయ్యింది,బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ ని సాధించిందని చెప్పుకోవచ్చు.

సినిమాలోని మైనస్ పాయింట్స్ దగ్గరికి వస్తే ఇది వరకే స్పోర్ట్స్ కాతాలో చాలా సినిమాలనే మన తెలుగు పరిశ్రమ అందించిన విషయమే తెల్సిందే,ఈ సినిమా కూడా కొంచెం ఓల్డ్ మూవీస్ కి రిలేట్ అవుతూనే ఉంటుంది,హీరో హీరోయిన్ మధ్యలోని సన్నివేశాలని అంతగా చూపించలేకపోయారు. కానీ, కోచ్ కి ప్లేయర్ కి ఉన్న అనుబంధాన్ని చక్కగా కాప్చర్ చేసారని చెప్పుకోవచ్చు.హీరోయిన్ యాక్టింగ్ ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి,తన యాక్టింగ్ సినిమాకి పెద్దగా కనెక్ట్ అవ్వలేకపోయింది.కొంచెం స్పోర్ట్స్ థీమ్ ని చూపిస్తే సినిమాకి ఆడ్ అయ్యేది,యూనిక్ గా అలోచించి మూవీ ని ఎక్స్టెండ్ చేస్తే బాగుండేది.క్లైమాక్స్ కూడా సమ్ హీరో విల్లియన్ రొటీన్ ఫైట్ ఉంటుంది.

ఓవరాల్ గా ప్రస్తుతం ఉన్న మూవీస్ తో కంపేర్ చేసి చూస్తే ఈ మూవీ ప్రేక్షకులకి నచ్చుతుందని చెప్పవచ్చు,స్పోర్ట్స్ ప్లేయర్స్ తప్పకుండ ఎంటర్టైన్ అవుతారు,మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అందరు ఫ్యామిలీస్ తో థియేటర్స్ లో ఎక్స్పీరియన్స్ చేయాల్సిన సినిమా ఇది.హీరో ఖచ్చితంగా తన యాక్టింగ్ తో సినిమా ఎక్కడ బోర్ కొట్టని ఫీలింగ్ ని తీసుకొస్తారు,ఫైనల్ గా వర్త్ వాచింగ్ అని చెప్పుకోదగిన సినిమా.





వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana
వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana