
DNews:19 Feb: సూర్యాపేట జిల్లా కేంద్రంలోని స్నేహ నగర్ కాలనీలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. గత కొంతకాలంగా ప్రేమిస్తున్నానంటూ వేధిస్తున్న మహేష్ అనే యువకుడు, యువతి తనను దూరం పెడుతుందనే కోపంతో సుత్తితో దాడికి పాల్పడ్డాడు. గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి లోపలికి చొరబడిన మహేష్, యువతి తలపై విచక్షణారహితంగా సుత్తితో దాడి చేశాడు.
ఈ ఘటనలో యువతి తలకు తీవ్ర గాయాలై స్పృహ కోల్పోయింది. స్థానికులు వెంటనే ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. యువతి అరుపులు విన్న స్థానికులు నిందితుడు మహేష్‌ను వెంబడించి పట్టుకున్నారు. విద్యుత్ స్తంభానికి కట్టేసి అతడికి దేహశుద్ధి చేసిన అనంతరం పోలీసులకు అప్పగించారు. ప్రేమ పేరుతో జరుగుతున్న ఈ ఘాతుకం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
