
DNews:02 Dec:నీలగిరి (నల్లగొండ జిల్లా), నారాయణపేట జిల్లా మక్తల్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన బందోబస్తు విధులు ముగించుకొని తిరిగి వస్తున్న పోలీసు సిబ్బంది రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటనలో ముగ్గురు ఏఎస్ఐలు (అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్లు) మరియు ఒక హెడ్ కానిస్టేబుల్ గాయపడ్డారు.
గుర్రంపోడ్ మండలం, జువ్విగూడెం సమీపంలో.ముగ్గురు ఏఎస్ఐలు, ఒక హెడ్ కానిస్టేబుల్.గాయపడిన పోలీసు సిబ్బందిని వెంటనే నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి చికిత్స అందుతోంది.ఈ ప్రమాద విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మంగళవారం స్వయంగా ఆసుపత్రికి వెళ్లి గాయపడిన సిబ్బందిని పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులతో మాట్లాడి, వారికి మెరుగైన వైద్యం అందించాల్సిందిగా కోరారు.ఎస్పీ వెంట నల్లగొండ డీఎస్పీ కొలను శివరాంరెడ్డి, టూ టౌన్ ఎస్ఐ వై. సైదులు తదితరులు ఉన్నారు. సిబ్బంది త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
