DNews:24 Nov:సనత్‌నగర్‌లోని ఈఎస్‌ఐ ఆస్పత్రిలో సోమవారం సాయంత్రం జరిగిన నిర్మాణ ప్రమాదం విషాదం మిగిల్చింది. ఆస్పత్రి పునర్నిర్మాణ పనులు జరుగుతున్న సమయంలో సెంట్రింగ్‌ అకస్మాత్తుగా కూలిపోయి ముగ్గురు సెంట్రింగ్‌ కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు.ఎమర్జెన్సీ వార్డులో పనులు చేస్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. సహాయకులు, స్థానికులు వెంటనే స్పందించినప్పటికీ అప్పటికే కార్మికులు ప్రాణాలు కోల్పోయారు.సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ దవాఖానకు తరలించారు.ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి గల కారణాలు తెలుసుకునేందుకు సంబంధిత అధికారుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు.ముగ్గురు కుటుంబాలను వీడని విషాదం ఈ ఘటన.

By rajesh

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana