Dnews 10: బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 గ్రాండ్ గా మొదలైంది. ఆదివారం (ఈ నెల 6న)సీజన్ 10 మొదలైంది. ఈసారి హౌస్ లోకి పలువురు సెలబ్రిటీలు, అలాగే కొంతమంది సాధారణ వ్యక్తులు (కామనర్లు) హౌస్‌లోకి ప్రవేశించారు. మొత్తంగా 16మంది హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు.నటి ఇనయా సుల్తానా మొన్నామధ్య ఒక ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితం గురించి పలు విషయాలను పంచుకున్నారు. సినీ పరిశ్రమలో అవకాశాల కోసం వెళ్లినప్పుడు ఎదురైన ఇబ్బందులు, స్వయంగా వెళ్లి అడగాల్సి వచ్చినప్పుడు ఎదురైన పరిస్థితులను వివరించారు. చిన్న పాత్రలు చేయడానికి కూడా సిద్ధపడిన సందర్భాలను గుర్తు చేసుకున్నారు. మనుషులను హ్యాండిల్ చేయగల సామర్థ్యం తనకు ఉందని, మీడియా వల్ల చాలా వరకు సహాయం లభించిందని తెలిపారు. అలాగే తన బ్రేకప్ వెనుక గల కారణాలపై స్పందిస్తూ.. తన మాజీ ప్రియుడి అసూయే ప్రధాన కారణమని చెప్పారు. తనకు వచ్చే ఫేమ్, సినిమా ఆఫర్లను చూసి తట్టుకోలేకపోవడమే అందుకు దారితీసిందని పేర్కొన్నారు. ఒక వివాహ వేడుకలో తనను ప్రజలందరి ముందు దుర్భాషలాడారని, ఆ క్షణమే వారి సంబంధానికి ముగింపు పలికారని వెల్లడించారు. సోషల్ మీడియాలో వ్యక్తిగత విషయాలు పంచుకోవడం వల్ల దిష్టి తగులుతుందని బలంగా నమ్ముతానని ఇనయా సుల్తానా చెప్పారు. అందుకే ఇటీవల కాలంలో ఫోటోషూట్‌లు చేయడం తగ్గించానని, తన ప్రొఫైల్‌లో వాటిని చూడలేమని తెలిపారు.ఎన్టీఆర్, పవన్, మహేష్‌లతో ఆడిపాడింది.. కట్ చేస్తే ఇప్పుడు కనిపించకుండాపోయింది.

ప్రస్తుతం తాను చేస్తున్న సినిమా ప్రాజెక్టుల వివరాలను కూడా దిష్టి తగులుతుందనే భయంతో దాచి ఉంచుతున్నానని ఇనయా సుల్తానా చెప్పుకొచ్చారు. అంతర్జాతీయ ప్రయాణాల గురించి మాట్లాడుతూ, తాను దుబాయ్, బ్యాంకాక్, శ్రీలంక, సింగపూర్/మలేషియా వంటి నాలుగు దేశాలకు మాత్రమే వెళ్లానని, అమెరికా లేదా యునైటెడ్ కింగ్‌డమ్ లాంటి దేశాలకు వెళ్లలేదని స్పష్టం చేశారు. దుబాయ్ ప్రయాణం కేవలం రియల్ ఎస్టేట్ పనుల నిమిత్తం జరిగిందని, స్నేహితుని వద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారం నేర్చుకోవడానికి వెళ్లానని తెలిపారు. సినీ పరిశ్రమలో స్థిరమైన ఆదాయం లేనందున, రెండవ ఎంపికగా రియల్ ఎస్టేట్‌ను ఎంచుకున్నట్లు వెల్లడించారు. తన స్నేహాల గురించి ప్రస్తావిస్తూ, తాను చాలా ఒంటరిగా ఉంటానని, తన బాధలను ఎవరితోనూ పంచుకోలేనని చెప్పారు. ఎవరితోనైనా చెప్పుకుంటే తనకే లోపంగా అనిపిస్తుందని తెలిపారు. సంతోషంగా ఉన్నప్పుడు అందరినీ కలుస్తానని, బాధలో ఉన్నప్పుడు ఒంటరిగా ఉంటానని పేర్కొన్నారు.అలాంటి సినిమాలు ఆడవు అన్నారు.. కానీ నా సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది: దుల్కర్ సల్మాన్

బిగ్ బాస్ ప్రయాణంపై ఇనయా సుల్తానా మాట్లాడుతూ, బిగ్ బాస్ తర్వాత తన జీవితంలో పెద్దగా మార్పు రాలేదని, నిజానికి సినిమా పరిశ్రమలో తన పారితోషికం తగ్గిందని ఆవేదన వ్యక్తం చేశారు. బిగ్ బాస్ వల్ల పేరు వస్తుంది కానీ సినిమా అవకాశాలు రావని, చాలా మందికి నెగెటివిటీ వస్తుందని, అయితే తనకు మాత్రం దేవుడి దయ వల్ల పాజిటివిటీ లభించిందని తెలిపారు. తన కెరీర్‌లో ఇప్పటివరకు 11 సినిమాలు చేశానని, మరో 3 సినిమాలు విడుదల కావాల్సి ఉందని ఇనయా సుల్తానా పేర్కొన్నారు. అలాగే ప్రస్తుతానికి ప్రేమ సంబంధాలు, వివాహంపై ఆసక్తి లేదని, మరో పదేళ్ల తర్వాతే ఆలోచిస్తానని ఇనయా సుల్తానా చెప్పుకొచ్చారు.

By CS.H

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana
వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana