
D Spiritual: Sep 16: జ్యోతిష్య శాస్త్రంలో వాస్తు శాస్త్రానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. అందుకే వాస్తు నియమాలు తప్పనిసరిగా పాటించాలని చెబుతుంటారు. కానీ కొందరు కొన్ని విషయాల్లో అస్సలే వాస్తు నియమాలు పాటించరు. అయితే ఇంట్లో ఉండే అద్దం విషయంలో తప్పకుండా వాస్తు నియమాలు పాటించాలంట, లేకపోతే అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందంట.
వాస్తు శాస్త్రం ప్రకారం అద్దం (Mirror) ఇంట్లో ఎక్కడ పెట్టాలో చాలా జాగ్రత్తగా నిర్ణయించాలి. సరిగ్గా ఉంచితే అది సంపద, శ్రేయస్సు తీసుకొస్తుంది. తప్పుగా ఉంచితే ఆర్థిక నష్టాలు కలిగించే అవకాశం ఉంది.
✅ అద్దం పెట్టడానికి అనుకూలమైన దిశలు:
- ఉత్తరం (North direction) 👉 ఇది కుబేరుడి దిక్కు. ఇక్కడ అద్దం ఉంచితే ధనం, ఆర్థికాభివృద్ధి పెరుగుతుందని నమ్మకం.
- తూర్పు (East direction) 👉 ఇది సూర్యుని దిక్కు. ఇక్కడ అద్దం ఉంచితే ఇంట్లో శక్తి, సానుకూల శక్తులు (Positive vibes) పెరుగుతాయి.
❌ ఎవైట్ చేయాల్సిన దిశలు:
- పడమర (West) & దక్షిణం (South) దిశల్లో అద్దం పెట్టకూడదు.
- అలాగే అద్దం ఎప్పుడూ కూడా బెడ్ రూమ్ లేదా బెడ్ ముందు పెట్టకూడదంట. ఇలా పెట్టడం వలన అశాంతి, మానసిక ఒత్తిడి పెరగడమే కాకుండా, వైవాహిక జీవితంలో అనేక సమస్యలు వస్తాయని చెబుతున్నారు వాస్తు నిపుణులు. అందుకే వీలైనంత వరకు బెడ్ రూమ్లో అస్సలే అద్దం పెట్టకూడదంట.’
🏠 ఎక్కడ అద్దం పెట్టడం మంచిది?
- లివింగ్ రూమ్ – సంపద, సానుకూల శక్తి పెరుగుతాయి, ఇంటి అందం కూడా పెరుగుతుంది.
- డైనింగ్ టేబుల్ పక్కన – భోజనం ప్రతిబింబం సంపద రెట్టింపు అవుతున్నట్లు భావన కలిగి, శ్రేయస్సు పెరుగుతుంది.
- చిన్న కారిడార్ / హాల్ – మానసిక ప్రశాంతత కలుగుతుంది, గది స్పేస్ పెద్దగా కనిపిస్తుంది.
💡 చిన్న టిప్:
అద్దం ఇంట్లో నగదు పెట్టే లాకర్ (cash locker) లేదా పెట్టుబడుల ఆల్మిరా ఎదుట ఉంచితే, అది డబ్బు రెట్టింపు అవుతున్నట్లుగా భావన కలిగి, సంపద వృద్ధి అవుతుందని వాస్తు చెబుతుంది.
