
DNews:11 Dec: ఇటీవల కాలంలో భారత మహిళల క్రికెట్ అభివృద్ధికి పలు కీలక చర్యలు తీసుకుంటున్న భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) మరో కీలక నిర్ణయానికి సిద్ధమైంది. 2025 వన్డే ప్రపంచకప్ విజేతలుగా ముద్ర పడిన టీమిండియా మహిళా క్రికెటర్లకు ప్రోత్సాహకంగా మ్యాచ్ ఫీజులను పెంచేందుకు డిసెంబర్ 22న జరిగే సమావేశంలో చర్చ జరగనుంది.హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత మహిళా జట్టు తొలిసారిగా ఐసీసీ వన్డే ప్రపంచకప్ గెలిచి దేశాన్ని గర్వపడే స్థాయికి తీసుకువచ్చింది. ఈ విజయంతో మహిళా క్రికెటర్ల వేతనాలు పెంచాలనే బీసీసీఐ నిర్ణయం తీసుకుంటోంది.ప్రస్తుతానికి డొమెస్టిక్ లెవెల్ మ్యాచ్‌లకు చెల్లిస్తున్న ఫీజులలో సవరణపై డిసెంబర్ 22న వర్చువల్ సమావేశంలో వివిధ ప్రతినిధులు చర్చించనున్నారు. మహిళా క్రికెట్ అభివృద్ధికి ఇది పెద్ద మార్గదర్శక నిర్ణయం అవుతుందని అంచనా.
