DNews:11 Dec: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026 సీజన్‌కు సంబంధించిన మినీ వేలం మరో కొన్ని రోజుల్లో అబుదాబిలో ప్రారంభం కానుంది. డిసెంబర్ 16న ఎతిహాద్ అరీనాలో జరగనున్న ఈ వేలంపై ఇప్పటికే అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. బీసీసీఐ డిసెంబర్ 9న విడుదల చేసిన 350 మంది ఆటగాళ్ల జాబితా వేలానికి మరింత హైప్‌ తీసుకొచ్చింది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2:30 గంటలకు వేలం ప్రారంభం కానుంది.

ఈసారి పంజాబ్ కింగ్స్‌కు అనుకోని మార్పులు చోటు చేసుకున్నాయి. జట్టు ప్రధాన కోచ్ రికీ పాంటింగ్ యాషెస్ సిరీస్ కోసం ఆస్ట్రేలియాలో కామెంటరీలో ব্যస్తంగా ఉండటంతో మినీ వేలానికి హాజరు కావడం లేదు. దీంతో జట్టు కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ పంజాబ్ వేలానికి ముందుండి నడిపించనున్నాడు. ఇది ఆయనకి ఒక కొత్త బాధ్యతగా మారింది.2025 సీజన్‌లో పంజాబ్‌ను 11 ఏళ్ల తర్వాత ఫైనల్‌కి చేర్చిన శ్రేయాస్ అయ్యర్ ఈ వేలంలో కూడా కీలక పాత్ర పోషించనున్నాడు. గత సీజన్‌లో ఆయన 604 పరుగులు 50 సగటుతో, 175 స్ట్రైక్ రేట్‌తో నమోదు చేశాడు. బ్యాట్‌తోనే కాదు, కెప్టెన్సీతో కూడా తన సామర్థ్యాన్ని నిరూపించాడు.

పంజాబ్ కింగ్స్ ప్రస్తుతం 4 స్లాట్‌లను మాత్రమే భర్తీ చేయాల్సి ఉంది. అందులో 2 విదేశీ ఆటగాళ్ల స్థానాలు ఉన్నాయి. జట్టు వద్ద రూ. 11.50 కోట్ల పర్స్ మిగిలి ఉంది.రిలీజు చేసిన ఆటగాళ్లు: ఆరోన్ హార్డీ, జోష్ ఇంగ్లిస్, కైల్ జామిసన్పంజాబ్ కింగ్స్ ఈ వేలంలో మూడు ముఖ్య అవసరాలను ఫోకస్ చేస్తోంది:బ్యాకప్ భారతీయ స్పిన్నర్ జట్టులో ఇప్పటికే ప్రధాన స్పిన్ ఎంపికలు ఉన్నా, ఒక నాణ్యమైన బ్యాకప్ అవసరం.ఓవర్సీస్ టాప్ ఆర్డర్ బ్యాటర్ కమ్ ఆల్‌రౌండర్ జట్టుకు పవర్‌ప్లేలో నిలదొక్కుకునే బ్యాటర్‌తో పాటు బాల్ చేతిలో 2–3 ఓవర్లు వేసే ఆల్‌రౌండర్ అవసరం.ఓవర్సీస్ పేస్ బౌలర్ డెత్ ఓవర్లలో నాణ్యమైన బౌలింగ్ చేసేవారి కోసం పంజాబ్ చూస్తోంది.

రికీ పాంటింగ్ గైర్హాజరీతో శ్రేయాస్ అయ్యర్ వేలం టేబుల్ వద్ద నాయకత్వం వహించనుండటం పంజాబ్ కోసం కీలక అధ్యాయం. తన జట్టును బలోపేతం చేయడానికి అయ్యర్ అవసరాలను బట్టి ప్లేయర్లను ఎంపిక చేయనున్నాడు. గత సీజన్‌లో తన వ్యూహాలతో పంజాబ్‌ను ఫైనల్ వరకు తీసుకెళ్లిన శ్రేయాస్ ఈసారి వేలంలో కూడా మంచి నిర్ణయాలు తీసుకుంటాడని అభిమానులు ఆశిస్తున్నారు.

By rajesh

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana
వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana