D Spiritual: Nov 3: భారతదేశంలోని చాలా ప్రదేశాల్లో ప్రజలు అరటి ఆకుల్లో ఆహారం తింటారు. వివాహాది వంటి శుభ సందర్భాలలో కూడా అరటి ఆకుల్లో అతిథులందరికీ ఆహారం వడ్డిస్తారు. హిందూ మతంలో అరటి ఆకులపై ఆహారాన్ని ఉంచి కొంతమంది దేవుళ్లకు నైవేద్యంగా సమర్పిస్తారు. హిందూ మతంలో అరటి ఆకులపై ఏయే దేవుళ్లకు నైవేద్యం సమర్పిస్తారో ఈ రోజు తెలుసుకుందాం.

అరటి చెట్టును, అరటి ఆకును, అరటి పండ్లను హిందూ మతంలో చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు. ఎందుకంటే అరటి ఆకులలో శ్రీ మహా విష్ణువు, లక్ష్మీదేవి నివసిస్తుందని నమ్ముతారు. అందుకే అరటి చెట్టును దైవంగా భావించి పూజిస్తారు. పూజలో లేదా పవిత్రమైన కార్యక్రమాలలో ఉపయోగిస్తారు. అరటి చెట్టు గురించి ఒక నమ్మకం ఉంది. అరటి ఆకుల నుండి సానుకూల శక్తి ప్రవహిస్తుంది. ఇది ఇల్లు లేదా చుట్టుపక్కల ప్రాంతాల్లోని ప్రతికూల శక్తిని తొలగిస్తుంది.

శ్రీ మహా విష్ణువు అరటి చెట్టులో విష్ణువు స్వయంగా నివసిస్తాడని నమ్ముతారు. అందుకే అరటి ఆకులలో దేవుళ్లకు ఇష్టమైన ఆహారాన్ని శ్రీ మహా విష్ణువుకు నైవేధ్యంగా సమర్పిస్తారు. ఇంట్లో ఉన్న పూజ గదిలో కూడా అరటి ఆకులో విష్ణుమూర్తికి నైవేధ్యం సమర్పించడం వల్ల ఇంట్లో సుఖశాంతులు ఉంటాయని చెబుతారు. శ్రీ మహా విష్ణువును పూజించిన తరువాత ఎవరి వివాహంలో నైనా ఆటంకాలు ఎదురవుతుంటే వారు అరటి ఆకులపై ఆహారం నైవేద్యంగా పెట్టాలని, ఇలా చేయడం వల్ల వివాహానికి సంబంధించిన అన్ని అడ్డంకులు తొలగిపోతాయని కూడా నమ్ముతారు.

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana