DSports:30 OCT:హామిల్టన్: స్వదేశంలో తమ ఆధిపత్యాన్ని మరోసారి చాటుకున్న న్యూజిలాండ్ జట్టు, ఇంగ్లండ్‌పై రెండో వన్డేలో ఐదు వికెట్ల తేడాతో గెలిచి మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. దీంతో కివీస్ స్వదేశంలో వరుసగా పదో వ నమో

2019 జనవరి తర్వాత న్యూజిలాండ్ తమ గడ్డపై ఏ వన్డే సిరీస్‌ను కోల్పోలేదు.

ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ జట్టు 36 ఓవర్లకే 175 పరుగులకు ఆలౌట్ అయింది. జెమీ ఓవర్టన్ (42), కెప్టెన్ హ్యారీ బ్రూక్ (34) తప్ప మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. కివీస్ బౌలర్లు బ్లెయిర్ టిక్నర్ (4/34), నేథన్ స్మిత్ (2/27) దెబ్బకు ఇంగ్లండ్ వరుసగా వికెట్లు కోల్పోయింది.

తరువాత 176 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో డారిల్ మిచెల్ (56 నాటౌట్), రచిన్ రవీంద్ర (54), కెప్టెన్ మిచెల్ శాంట్నర్ (34 నాటౌట్) అద్భుత ఇన్నింగ్స్ ఆడి జట్టును 33.1 ఓవర్లలోనే గెలిపించారు. జోఫ్రా ఆర్చర్ (3/23) వేగవంతమైన బౌలింగ్‌తో కివీస్ బ్యాటర్లను కొంత ఇబ్బంది పెట్టినా ఫలితం మారలేదు.

బ్లెయిర్ టిక్నర్ తన ఘన ప్రదర్శనకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు.
సిరీస్‌లో చివరి, మూడో వన్డే శనివారం వెల్లింగ్టన్‌లో జరగనుంది.

By rajesh

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana