
DSports:30 OCT:సిడ్నీ: ఆస్ట్రేలియా పర్యటనలో గాయపడ్డ టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) ఆరోగ్యం నిలకడగా ఉందని సమాచారం. సిడ్నీలో జరిగిన మూడో వన్డేలో ఫీల్డింగ్ చేస్తూ క్యాచ్ అందుకునే ప్రయత్నంలో గాయపడ్డ అయ్యర్ ప్రస్తుతం కోలుకుంటున్నాడు.
తన ఆరోగ్యం గురించి స్వయంగా సోషల్ మీడియాలో అప్‌డేట్ ఇస్తూ, “నేను క్రమంగా కోలుకుంటున్నాను. ఈ సమయంలో నా గురించి ఆలోచించి, మద్దతుగా ఉన్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు” అని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు పెట్టాడు.
అయ్యర్‌కు గాయం కారణంగా రెండు రోజులపాటు సిడ్నీ ఆసుపత్రిలో ఐసీయూ చికిత్స అందించారు. వైద్యుల ప్రకారం పెద్ద ప్రమాదం ఏమీ లేదని తేలింది. పూర్తిగా కోలుకోవడానికి సుమారు మూడు వారాల సమయం పట్టవచ్చని అంచనా.
మూడో వన్డేలో హర్షిత్ రానా బౌలింగ్‌లో అలెక్స్ క్యారీ కొట్టిన షాట్‌ను డైవ్ చేస్తూ అద్భుతంగా క్యాచ్ పట్టిన అయ్యర్ – వెంటనే పక్కటెములు నొప్పితో కుప్పకూలాడు. ఫీజియో పరీక్షించినా నొప్పి తగ్గకపోవడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు.
నవంబర్ చివర్లో దక్షిణాఫ్రికాతో జరగనున్న మూడు వన్డేల్లో ఆడే అవకాశం ఉందని టీమిండియా మేనేజ్‌మెంట్ ఆశాభావం వ్యక్తం చేసింది.
👉ఈ సిరీస్ నవంబర్ 30, డిసెంబర్ 3, డిసెంబర్ 6 తేదీల్లో జరగనుంది.
